అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025 (IPL 2025) చివరి దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్‌లో ఆడే జట్లు ఏంటో కన్‌ఫాం అయింది. స్థానాల విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది.
ప్రస్తుతం టాప్‌లో పంజాబ్(PBKS) ఉంది. రెండు మూడు, నాలుగు స్థానాలలో జీటీ, ఆర్సీబీ, ముంబై ఉన్నాయి. ఈ రోజు ఆర్సీబీ(RCB) తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఇందులో భారీ మెజారిటీతో నెగ్గి రన్‌రేట్ మెరుగుపరచుకుంటే తొలి స్థానం కూడా దక్కించుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ మే 29న వారి సొంత మైదానం ముల్లన్‌పూర్లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
IPL 2025: టేబుల్ టాపర్
ముంబయి నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ అలవోకగా చేజ్ చేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై పై (Mumbai Indians) గెలుపుతో పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్ గా నిలిచింది. టాప్ 2 లో ఒక స్థానాన్ని కన్ ఫర్మ్ చేసేసుకుంది. పంజాబ్ తో మ్యాచ్ లో ఓటమితో టాప్ 2 రేస్ నుంచి తప్పుకున్న ముంబై ఎలిమినేటర్ ఆడనుంది.
IPL 2025 : రాణించిన బ్యాటర్లు
పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్‌లు అద్భుతంగా రాణించారు. వారిద్దరు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ప్రియాన్ష్ ఆర్య 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 9 ఫోర్లు,3 సిక్సులతో 73 పరుగులు జోడించాడు. మరో వైపు పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(13), శ్రేయస్ అయ్యర్(26*) (Shreyas Ayyar), నేహాల్ వధేరా(2*) పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశాడు. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.