అక్షరటుడే, బీర్కూర్: Paddy Centers | రైతులకు పారదర్శకంగా చెల్లింపులు జరగాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి పేర్కొన్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని (Thimmapur Village) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Purchasing Centers) ఆమె సందర్శించారు.
రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. కేంద్రంలోని రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. వరిధాన్యం తూకం విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు (Farmers) ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం నిల్వ, రవాణా, చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమయానికి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో పీడీ సురేందర్, డీసీవో రామ్మోహన్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, డీఎం శ్రీకాంత్, డీపీఎం సాయిలు, ఏపీఎం శిరీష, సెంటర్ ఇన్‌ఛార్జి మహేందర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, వీవోఏ కవిత, మోహన్ కృష్ణ ఉన్నారు.
