ePaper
More
    HomeసినిమాPayal Rajput | గ్లామ‌ర్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌కి వింత స‌మ‌స్య‌.. ఎలా తీరుతుందో అంటూ...

    Payal Rajput | గ్లామ‌ర్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌కి వింత స‌మ‌స్య‌.. ఎలా తీరుతుందో అంటూ ఆవేద‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: payal rajput | అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్ (Payal rajput) గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో (RX 100 movie) మంచి హిట్ అందిపుచ్చుకొని ఆ తరువాత అవకాశాలు బాగానే ద‌క్కించుకుంది. కానీ విజయం మాత్రం మళ్లీ అంత సులభంగా దక్కలేదు. చివరకు మంగళవారం అంటూ మళ్లీ అజయ్ భూపతి (ajay bhupathi) వల్లే హిట్టు దొరికింది. అలా చాలా ఏళ్లకు మళ్లీ మంగళవారం అంటూ హిట్టు కొట్టినా పాయల్‌కి మాత్రం అవకాశాలు కరువయ్యాయి. ఇక దీంతో పాయల్ విసిగిపోయినట్టుగా కనిపిస్తోంది. తొలి మూవీ హిట్ అయిన కూడా ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎన్టీఆర్: కథానాయకుడు, RDX లవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక వంటి చిత్రాలు నిరాశ ప‌రిచాయి.

    payal rajput | అయ్యో పాపం..

    మంగళవారం సినిమా (mangalavaram movie) తప్ప ఇటీవ‌లి కాలంలో పాయ‌ల్‌ని ఆకాశానికి ఎత్తిన సినిమా లేదు. తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో (kannada and punjab) పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ సైతం నిరాశే ఎదురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో (social media) చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో (glamour photos) రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టా స్టోరీలో తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరించింది. పాయల్ నిన్న ఓ ఈవెంట్‌కు కారులో వెళ్తూ ఉంది. మార్గమధ్యంలోనే ఓ వీడియో తీసింది. ఆ వీడియోని స్టోరీలో పెట్టింది. ‘ప్రస్తుతం నాకు కంటి సమస్య (eye problem) వచ్చింది. దాని పేరు కూడా సరిగ్గా పలకలేకపోతోన్నాను.. నా కంటికి ఇప్పుడు ఏదీ కూడా సరిగ్గా కనిపించడం లేదు.. అన్నీ రెండు రెండు కనిపిస్తున్నాయి.. కాస్త బ్లర్డ్‌గా కనిపిస్తున్నాయి..

    పరిస్థితి ఎలా ఉన్నా కూడా.. ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్‌కి అనుగుణంగా ఈవెంట్‌కు వెళ్లాల్సిందే.. ఇక అక్కడ ఎలా మ్యానేజ్ చేయాలో.. అసలు ఈ సమస్య ఎలా తీరుతుందో.. అంతా ఆ దేవుడి దయ.. అయినా ఇప్పుడు ఈ కళ్లద్దాలు పెట్టి మ్యానేజ్ చేస్తాను.. కనిపించకపోతే ఏం నటించగలను కదా?’ అని పాయల్ చెప్పుకొచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. యంగ్ హీరో కార్తికేయ (young hero karthikeya) సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో (RX 100 movie) తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...