అక్షరటుడే, వెబ్‌డెస్క్: Toll Charges | టోల్ చెల్లింపుల విధానంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం (central government) కసరత్తు చేస్తోంది. జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే కొత్త టోల్ పాలసీ (new toll policy) రూపొందించే పనిలో నిమగ్నమైంది. ప్రతీసారి టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఏడాదికి ఒకేసారి టోల్ చెల్లించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. అయితే, ఈ పాలసీ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Toll Charges | రూ.3 వేలు చెల్లిస్తే చాలు..
వివిధ పట్టణాలు, ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారుల మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అందుకు గాను ప్రభుత్వానికి (government) టోల్ చెల్లించాలి. ప్రస్తుతం దూరాన్ని బట్టి టోల్ వసూలు చేస్తున్నారు. మనం ప్రయాణం చేసే మార్గంలో ఎన్ని టోల్‌ప్లాజాలు (toll plazas) అన్ని చోట్లా చెల్లించాలి. రిటర్న్ జర్నీలో కూడా టోల్ చెల్లించాల్సిందే. అయితే, ఈ ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానాన్ని మార్చి సులభమైన టోల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.
ఏడాది మొత్తానికి ఒకేసారి టోల్ చెల్లించే అవకాశం కల్పించనుంది. ఒకేసారి రూ.3 వేలు చెల్లిస్తే వాహనదారులు ఏడాది పొడవునా అన్ని జాతీయ రహదారులు (national highways), ఎక్స్‌ప్రెస్ వేలు, స్టేట్ ఎక్స్‌ప్రెస్ వేలలో (expressways and state expressways) అపరిమిత దూరం వరకు ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఆ సమయంలో ప్రత్యేకంగా టోల్ ఫీజు (toll fee) చెల్లించాల్సిన అవసరం లేదు. అప్ అండ్ డౌన్ చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరముండదు.
Toll Charges | ఫాస్టాగ్ ద్వారానే..
ఏడాది ప్యాకేజీ (annual package) కోసం వాహనదారులు ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు. ఫాస్టాగ్ (FASTag) ఉంటే సరిపోతుంది. ఒకేసారి రూ.3 వేలు రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మొత్తాన్ని చెల్లించి ఏడాది పొడవునా జాతీయ, రాష్ట్ర రహదారులపై (national and state highways) ఎన్నిసార్లయినా, ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చు. తరచూ టోల్‌ప్లాజాల (toll plazas) ద్వారా ప్రయాణించే వారి కోసం కేంద్రం మరో అద్భుతమైన అవకాశం కూడా కల్చించే యోచనలో ఉంది.
ఒకేసారి రూ.30 వేలు చెల్లిస్తే, 15 సంవత్సరాల పాటు అపరిమితమైన ప్రయాణాన్ని అస్వాదించే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు, వార్షిక ప్యాకేజ్ (annual package) మాత్రమే కాకుండా దూరాన్ని బట్టి టోల్ చెల్లించే విధానం కూడా అమలులోకి రానుంది. ఈ డిస్టేన్స్ బేస్డ్ ప్రైస్ విధానంలో 100 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఈ కొత్త టోల్ పాలసీ విధానం ఎప్పటి నుంచి అమలయ్యేది కేంద్రం ఇంకా వెల్లడించలేదు.
