Homeఆంధప్రదేశ్Janasena Party | జనసేనలో భారీ ప్రక్షాళన ప్రారంభం.. కొత్త కమిటీలపై పవన్ కల్యాణ్ ఫుల్...

Janasena Party | జనసేనలో భారీ ప్రక్షాళన ప్రారంభం.. కొత్త కమిటీలపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్

జనసేనలో భారీ ప్ర‌క్షాళ‌న చేయ‌బోతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈ భారీ ప్రక్షాళనతో, పార్టీ 2029 ఎన్నికల నాటికి మరింత బలపడే అవకాశాలపై రాజకీయ విశ్లేషకులు దృష్టి సారిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janasena Party | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని సమూలంగా బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచిన నేపథ్యంలో, జనసేనలో పార్టీ (Janasena Party) ప్రక్షాళనను వేగవంతం చేయాలని ఆయన నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయడానికి దిశానిర్దేశం చేశారు.

Janasena Party | జనసేనలో కమిటీల పునర్వ్యవస్థీకరణకు పవన్ శ్రీకారం

పార్టీలోని అన్ని కమిటీలను శాస్త్రీయంగా, సమన్వయంతో పునర్వ్యవస్థీకరించాలని పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఇప్పటికే సూచించారు.కమిటీలలో ఎవరు ఉండాలి…ఎవరిని చేర్చాలి…ఎవరిని మార్చాలి…బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉండాలి వంటి అంశాలపై కేంద్రకమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో పార్టీ శ్రేణులు, వీరమహిళల అభిప్రాయాలు, అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నారు. నివేదికలను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Janasena Party | స్థానిక ఎన్నికలు సమీపంలో.. అందుకే ప్రక్షాళన

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ కొత్త నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు.ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇప్పటికే భర్తీ చేసిన నేపథ్యంలో జనవరి నాటికి కొత్త పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Janasena Party | 6 జిల్లాల్లో కమిటీలు దాదాపు ఖరారు

జనసేన తొలి దశలో క్రింది జిల్లాల్లో కమిటీల పునర్వ్యవస్థీకరణను పూర్తి చేసే దిశగా అడుగులు వేసింది:

  • ఉమ్మడి నెల్లూరు
  • ప్రకాశం
  • గుంటూరు
  • కృష్ణా
  • విజయనగరం
  • శ్రీకాకుళం

ఉమ్మడి విశాఖ, గోదావరి జిల్లా (Godavari District)ల్లో పార్టీకి బలమైన నేతృత్వం ఉన్నందున అదే బలం మిగిలిన జిల్లాల్లోనూ ఉండేలా కొత్త కమిటీలను ప్లాన్ చేస్తున్నారు. జనసేన కేంద్రకమిటీ భావన ప్రకారం, గ్రామ, మండల‌, జిల్లా స్థాయిలో బలోపేతమైన నిర్మాణం ఉంటేనే పార్టీ మరింతగా విస్తరిస్తుంది.ఆ దిశగా 2029 ఎన్నికల్లో పార్టీ ప్రాతినిథ్యం పెరగాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.కార్యకర్తలు నిరాశ చెందకుండా…పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా పాల్గొనేలా వారికి పదవులు అప్పగించాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పార్టీ పనితీరులో ప్రజా భాగస్వామ్యం పెంచే దిశగా అడుగులు వేయ‌నున్నారు. ప్రభుత్వ పనితీరు మీద క్షేత్రస్థాయిలో ప్రచారం, పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తల పాత్ర పెంపు, కమిటీలు నిర్మాణాన్ని డిసెంబర్–జనవరిలో పూర్తి చేసేలే ప్లాన్.. ఈ పాయింట్లను పాటించాలని సీనియర్ నేతలకు పవన్ ఇప్పటికే స్పష్టమైన సూచనలు చేశారు.