అక్షరటుడే, ఇందూరు: Pawan birthday celebrations : పవర్ స్టార్ Power Star, ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Deputy Chief Minister Pawan Kalyan జన్మదిన వేడుకలను మంగళవారం (సెప్టెంబరు 2) నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
నగరంలోని గాయత్రినగర్ చౌరస్తా వద్ద కోటగల్లీ లడ్డన్న, శ్రీధర్, సుమన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు.
Pawan birthday celebrations : మరెన్నో పదవులు అధిరోహించాలని..
ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరెన్నో పదవులు అధిరోహించాలని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పవన్, పద్మానగర్ దిలీప్, భాను, ఖుషి, సాయి, హర్ష, పునీత్, కిట్టు, శ్రీకర్, గౌతమ్, తరుణ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.