HomeUncategorizedPawan Kalyan | ప్ర‌మాదం త‌ర్వాత తొలిసారి బ‌య‌ట క‌నిపించిన ప‌వ‌న్ త‌న‌యుడు.. భ‌లే క్యూట్...

Pawan Kalyan | ప్ర‌మాదం త‌ర్వాత తొలిసారి బ‌య‌ట క‌నిపించిన ప‌వ‌న్ త‌న‌యుడు.. భ‌లే క్యూట్ ఉన్నాడుగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pawan Kalyan | అన్నా లెజినోవా, ప‌వ‌న్ కల్యాణ్ త‌న‌యుడు మార్క్ శంక‌ర్ సింగపూర్ పాఠ‌శాల‌లో జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో గాయ‌ప‌డిన విషయం తెలిసిందే. ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ వెంట‌నే సింగ‌పూర్ వెళ్లి కుమారుడి ఆరోగ్యం గురించి ఆరాలు తీశారు. కుమారుడు కోలుకునే వ‌ర‌కు ఆసుప‌త్రిలో ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న అర్ధాంగి అన్నా లెజ్నోవా ద‌గ్గ‌రుండి కుమారుడ్ని చూసుకున్నారు. కాస్త కోలుకున్న త‌ర్వాత ఇండియాకి తీసుకు వ‌చ్చారు. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) త‌న కుమారుడి ఆరోగ్యం గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తన 8 ఏళ్ల కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌(Singapore)లో జరిగిన అగ్నిప్రమాదం వ‌ల‌న చాలా ఇబ్బందులు ప‌డ్డాడు. శారీరకంగా కోలుకున్నప్పటికీ, మానసికంగా కోలుకోలేద‌ని పవన్ తెలిపారు.

Pawan Kalyan | ఇద్ద‌రు త‌న‌యుల‌తో..

మార్క్ శంకర్ కి జ‌రిగిన అగ్ని ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలతో పాటు, పొగపీల్చడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. అయితే మార్క్ శంక‌ర్ ఓ రోజు రాత్రి నిద్రలో లేచి, బిల్డింగ్ నుంచి పడ్డట్టు కలలు వస్తున్నాయని అని చెప్పాడ‌ట‌. దాంతో సైకియాట్రిస్ట్‌తో వెంటనే మెరుగైన చికిత్స మొదలుపెట్టాం అని ప‌వ‌న్ అన్నారు. అయితే ప్ర‌మాదం త‌ర్వాత మ‌ళ్లీ మార్క్ శంక‌ర్ ఎక్క‌డ క‌న‌ప‌డ‌లేదు. తాజాగా ప‌వ‌న్ కల్యాణ్ త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి దిగిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. అకీరాతో పాటు మార్క్ కూడా చాలా హ్యాండ్స‌మ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈరోజు మంగ‌ళ‌గిరిలోని త‌న నివాసంకి చేరుకున్న స‌మ‌యంలో ఆయ‌న‌తో పాటు పెద్ద కుమారుడు అకీరా నందన్(Akhira Nandan), చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) ఉన్నారు. వీరి ఫొటో ప్ర‌స్తుతం వైర‌ల‌వుతుంది. మ‌రోవైపు త‌న నివాసం నుంచి పార్టీ ఆఫీస్‌కి వెళ్లిన ప‌వ‌న్ అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన అంశాలపై చర్చించిన‌ట్టు తెలుస్తుంది. మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అక్కడ జలజీవన్ మిషన్ కింద రూ. 1,290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంత‌రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించ‌నున్నారు ప‌వ‌న్ . ఆ త‌ర్వాత 1:45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి తిరిగి బయలుదేరతారని అధికార వర్గాలు స్ప‌ష్టం చేశాయి.