HomeUncategorizedPavan Kalyan | మురుగన్ నేలపైన అడుగుపెట్టిన పవన్​ కల్యాణ్​.. డైన‌మిక్ లుక్‌లో అదరగొట్టిన డిప్యూటీ...

Pavan Kalyan | మురుగన్ నేలపైన అడుగుపెట్టిన పవన్​ కల్యాణ్​.. డైన‌మిక్ లుక్‌లో అదరగొట్టిన డిప్యూటీ సీఎం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pavan Kalyan). ఇటీవ‌ల ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూట్​లో పాల్గొన్న ప‌వ‌న్ కల్యాణ్ ఆ త‌ర్వాత యోగా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ తమిళనాడు (Tamil Nadu)లోని మదురైలో పర్యటిస్తున్నారు. గతంలో ఓసారి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమిళనాడు వెళ్లిన పవన్.. ఇవాళ మరోసారి ఆలయాల్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మదురై చేరుకున్న పవన్​కు అక్కడి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తో పాటు పలువురు నేతలు ఇందులో ఉన్నారు.

Pavan Kalyan | స్వాగ్ లుక్

తమిళనాడులో మురుగ భక్తర్గల్ మానాడు (Muruga Bhakthargal Manadu) కోసం వెళ్లిన పవన్ లుక్ వైరల్​గా మారింది. వైట్ అండ్ వైట్​లో పవన్ కల్యాణ్​ పంచెకట్టుతో చార్టెడ్ ఫ్లైట్ నుంచి బయటకొస్తుండ‌డం అంద‌రిని ఆక‌ట్టుకుంది. త‌న‌దైన స్వాగ్‌తో ప‌వ‌న్ ఆక‌ట్టుకున్నాడు. ఆయన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మార‌డంతో పాటు ఫ్యాన్స్​కి అమితానందం క‌లుగ‌జేస్తున్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం ప‌వ‌న్ తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రావాలని తమిళనాడు బీజేపీ (Tamil Nadu BJP) నేతల నుంచి అందిన ఆహ్వనం మేరకు పవన్ వెళ్లారు.

గ‌తంలో రెండు రోజుల పాటు తమిళనాడు, కేరళలోని పలు ఆలయాల్ని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. అక్కడి స్థానిక నేతలతో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాదిలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు పవన్ కల్యాణ్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా ఆలయాలు సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ టూర్ల ప్రభావం ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి మేలు చేస్తుందా లేదా అన్నది వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తేలనుంది. సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కల్యాణ్ మురుగన్ నేలపైన అడుగుపెట్టారని జనసేన (Janasena) పార్టీ పోస్ట్ చేసింది. లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో మధురై నగరంలో మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పవన్ పాల్గొనున్నారు.