అక్షరటుడే, వెబ్‌డెస్క్ : OG Movie | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (OG) ట్రైలర్ తాజాగా విడుదలైంది. దర్శకుడు సుజీత్(Director Sujeeth) తెరకెక్కించిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 25న విజయదశమి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, పాటలు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించగా… ఇప్పుడు ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గ్యాంగ్‌స్టర్ లుక్, పవర్‌పుల్ డైలాగ్స్, యాక్షన్ మేనరిజం ఫ్యాన్స్‌ను పీక్స్‌కు చేర్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్వాగ్, గ్యాంగ్‌స్టర్ అవతారంలో స్టన్నింగ్ లుక్, తమన్ బీజీఎం, విజువల్స్‌కు కలిసిపోయే గ్రిప్‌డ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రాండ్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్‌లు అన్ని సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
OG Movie | సూపర్బ్ రెస్పాన్స్..
ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే శ్రియా రెడ్డి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, అర్జున్ దాస్, అభిమన్యు సింగ్, శుభలేక సుధాకర్, హరీష్ ఉత్తమన్, వెన్నెల కిశోర్ లాంటి స్టార్ క్యాస్ట్ అందులో భాగమయ్యారు. ప్రత్యేక గీతంలో నేహా శెట్టి సందడి చేయనున్నారు. సెప్టెంబర్ 21న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ దసరా పండుగ సీజన్‌లో విడుదల కానున్న OGపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ మళ్లీ వెండితెరపై ఓ రేంజ్‌లో రచ్చ చేయనున్నాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఫుల్ హైప్‌లో ఉన్నారు. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే… బాక్సాఫీస్‌ను OG షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సీజన్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘OG’ నిలవడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ గ్యాంగ్ స్టర్ ఓజాస్ గంభీరగా నటించి అదరగొట్టాడు. ట్రైలర్లో స్టైలిష్ మేకింగ్ అండ్ షార్ప్ కట్స్, భారీ యాక్షన్ విజువల్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.