ePaper
More
    HomeసినిమాPawan kalyan OG movie | ప‌వన్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లోయింగ్ న్యూస్.. అభిమానుల‌కి...

    Pawan kalyan OG movie | ప‌వన్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లోయింగ్ న్యూస్.. అభిమానుల‌కి పూన‌కాలే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan kalyan OG movie | ప‌వ‌న్ క‌ళ్యాణ్ Pawan Kalyan క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌దు. ఇప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజ‌కీయాల‌లోకి (politics) వ‌చ్చాక కూడా ప‌వ‌న్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. అయితే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు (pawan kalyan movies) చేయ‌డం త‌గ్గించారు. ఇటీవ‌ల హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్ని (hari hara veera mallu movie) పూర్తి చేశారు. ఇక పవన్ కల్యాణ్ అవెయిటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘ఓజీ’ మూవీ (OG movie) ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఈ మూవీ మళ్లీ ప్రారంభమైంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియాలో (DVV entertainer social media announcement) అధికారికంగా వెల్లడించింది. ‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం.’ అంటూ పోస్ట్ చేసింది.

    Pawan kalyan OG movie | ఓజీ జోష్‌..

    ‘సాహో’ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో (sujeeth direction) ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా, ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే, ఆ తర్వాత పవన్ బిజీగా మారడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్ లేకుండా కొన్ని రోజులు షూటింగ్ పూర్తి చేశారు. తాజాగా.. మళ్లీ షూటింగ్ (shooting) ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ వారమే ఈ మూవీ సెట్స్‌లో (movie sets) పవన్ జాయిన్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య ‘ఓజీ’ మూవీని (OG movie) నిర్మిస్తుండగా.. ముంబయి మాఫియా నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా (crime thriller) తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. పవన్ సరసన ప్రియాంక్ మోహన్ హీరోయిన్‌గా (heroine priyanka mohan) నటిస్తున్నారు.

    బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (bollywood actor imran hashmi) నెగిటివ్ రోల్ చేస్తుండగా.. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ (arjun das) తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ (music director thaman) అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. హీరో, విలన్ మధ్య కీలక సీన్స్ షూట్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని త్వరలోనే పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ (AP deputy CM pawan kalyan)బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రజా పాలనలో బిజీగా మారారు. ఓజీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు, పలు సందర్భాల్లో బహిరంగ సభల్లోనూ ఓజీ, ఓజీ అంటూ ఫ్యాన్స్ నినాదాలు (OG fans slogan) చేశారు. . ఇప్పుడు మళ్లీ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో వారిలో జోష్ నెలకొంది.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    More like this

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...