OG Firestorm Song
OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే...!

అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇటీవ‌ల భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా బోల్తా కొట్ట‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఓజీ(OG Movie)పైనే ఉంది. సెప్టెంబ‌ర్ 25న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే కొద్ది సేప‌టి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులకు అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు ‘దే కాల్ హిమ్ OG’ అంటూ సాగే సాంగ్‌ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో తొలి పాట ‘ఫైర్ స్ట్రోమ్’(OG Firestorm Song)ని ఆగస్టు 2న అనౌన్స్ చేసిన దానికన్నా ముందుగానే రిలీజ్ చేశారు.

OG Firestorm Song | అద‌ర‌గొట్టేశారు..

పాట మొదటి సెకండ్ నుంచే హై ఎనర్జీతో ఊపెక్కించి, చివరికి గూస్ బంప్స్ కలిగించేలా రూపొందించారు. థ‌మ‌న్ మ్యూజిక్​ అందించిన ఈ సాంగ్​ను థమన్ ఎస్, నజీరుద్దీన్ & భరతరాజ్, సిలంబరసన్ టిఆర్ (శింబు), దీపక్ బ్లూ, రాజా కుమారి క‌లిసి ఆల‌పించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ లుక్స్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తున్నాయి. ఆయన స్టైలింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్ట్స్ లెవెల్ అనిపిస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ ఇలా హ్యాండ్సమ్‌గా కనిపించడాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఈ సాంగ్‌కు సంగీత దర్శకుడు తమన్(Music director Thaman) హై వోల్టేజ్ ట్యూన్ ఇచ్చారు. అదిరిపోయే బీట్స్‌తో, థ్రిల్‌తో ఈ పాట‌ను నింపేశారు. ఈ సాంగ్​ను వినటం ఒక ఎక్స్‌పీరియెన్స్ లా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.

ఈ పాటను పాట పాడినవాళ్లలో తమిళ స్టార్ శింబు(Tamil star Shimbu) ప్రత్యేక ఆకర్షణ. లిరిక్స్ విషయంలో కూడా ఈ సాంగ్ స్పెషల్. తెలుగు పాటలను విశ్వ, శ్రీనివాస్ మౌళి రాయగా, ఇంగ్లిష్ భాగాన్ని రాజ్ కుమారి రచించారు. జపనీస్ లిరిక్స్‌ను వొజ్జాల రాశారు. ఇది పాటకు ఇంటర్నేషనల్ టచ్ తీసుకువ‌చ్చింది. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ఆయన చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇదే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య మరియు దాసరి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలన్ రోల్‌లో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. ఈ ఫస్ట్ సాంగ్‌తో ఇప్పటికే ఆడియన్స్‌లో ఉన్న హైప్ మరింతగా పెరిగింది. #FireStorm అనే పేరుకి న్యాయం చేస్తూ, పాట పవన్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులందరికీ పండుగ‌ను తీసుకొచ్చింది. విడుద‌లైన గంట‌లోపే ఈ సాంగ్ దాదాపు 8 ల‌క్ష‌ల వ్యూస్ రాబ‌ట్టింది.