HomeUncategorizedPawan Kalyan | తిరంగా ర్యాలీలో అంద‌రి దృష్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతి టాటూపైనే.. ఏంటీ...

Pawan Kalyan | తిరంగా ర్యాలీలో అంద‌రి దృష్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతి టాటూపైనే.. ఏంటీ స‌డెన్‌గా ఇది..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | ప్రజల రక్షణ కోసం అండగా ఉన్న సైనికులకు మద్దతుగా విజయవాడలో Vijaywada తిరంగా యాత్ర పేరుతో భారీ ర్యాలీ నిర్వహించిన విష‌యం తెలిసిందే. భారత సైనికులకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(Indira Gandhi Municipal Stadium) నుంచి బెంజ్ సర్కిల్(Benz Circle) వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతపట్టుకుని తమ దేశభక్తిని చాటుకున్నారు.

Pawan Kalyan | ఏంటీ ఆ టాటూ..

ఈ ర్యాలీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) చేతికి ఉన్న టాటూ Tattoo ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఎప్పుడు లేనిది ప‌వ‌న్ చేతిపైన టాటూ కనిపించించడంతో చాలా ఊహగానాలు వెలువడ్డాయి. ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని.. ఆ టాటూకి అర్థం ఏంటని నెటిజన్స్ ఆలోచిచండం మొదలు పెట్టారు. అయితే ఓజీ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ ఆ టాటూ వేయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. టాటూ మీనింగ్ కూడా అదేనని తెలుస్తుంది. మరి ఆ పచ్చబొట్టు సినిమా కోసమే వేసుకున్నారా.. లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ఒకటి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌(Mafia Bagdrop)తో రూపొందుతోంది. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ‌రోవైపు ప‌వన్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్ర షూటింగ్ ఇటీవ‌లే పూర్తైంది. ఈ సినిమాని జూన్ 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ రీసెంట్‌గా పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.