ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pawan Kalyan | పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్...

    Pawan Kalyan | పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pawan Kalyan | పాకిస్తాన్​కు అనుకూలంగా మాట్లాడే వారు అక్కడికే వెళ్లిపోవాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ ap deputy cm pawan kalyan​ ఫైర్​ అయ్యారు. మన దేశంలో పుట్టి.. మన దేశంలో ఉంటూ.. కొందరు పాక్​కు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు.

    పహల్​గామ్​ అమరులకు జనసేన ఆధ్వర్యంలో మంగళవారం మంగళగిరిలో నివాళులర్పించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపితే.. కొందరు పాక్​కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. కొందరు ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వాళ్లు వెంటనే ఆ దేశానికి వెళ్లిపోవచ్చంటూ పవన్ సూచించారు. కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదంటూ పవన్ హితవు పలికారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. సెక్యులరిజం పేరుతో కొందరు కాంగ్రెస్ నేతలు పాక్‌కు అనుకూలంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.

    Pawan Kalyan | మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం..

    ఉగ్రదాడిలో బలైన మధుసూదన్ కుటుంబ సభ్యులకు జనసేన తరఫున రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘‘చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారు? కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడా ఉండొద్దంటే ఎక్కడికెళ్లాలి? యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగంతో మాట్లాడారు.

    More like this

    Indian origin man beheaded | అంత కసినా.. అమెరికాలో భారత సంతతి తల నరికి.. విసిరేశాడు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian origin man beheaded : అమెరికా America లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది....

    Lorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్

    అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్...

    Political crisis in Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. మోడీ లాంటి బలమైన నాయకుడిని కోరుకుంటున్న యువత

    Political crisis in Nepal : నేపాల్‌లో Nepal రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. జెన్‌ జెడ్‌ యువతరం...