అక్షరటుడే, వెబ్‌డెస్క్:Pawan Kalyan | పవన్ కళ్యాణ్ Pawan kalyan.. నటుడు మాత్రమే కాదు కీలక రాజకీయ నేత కూడా. నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూ, రాజకీయాలపై అవగాహనకు తన తండ్రే కారణమని పవన్ పేర్కొన్నారు. ‘సినిమాల్లోకి రాకముందు నటుడిగా మారాలని నేను అనుకోలేదు. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, కమ్యూనిస్టు భావజాలాన్ని పాటించేవారు. ఆయన వల్లే మాకందరికీ రాజకీయాలపై అవగాహన ఏర్పడింది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను కానీ నా ఆలోచన అంతా సమాజంపైనే ఉండేది. అదే ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చానని’ పవన్ వివరించారు.
Pawan Kalyan | మారిన స్టైల్…
ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నా, సినిమాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పవన్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh). హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ అని టాక్. ఇందులో పవన్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం(Deputy CM) బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమా షూటింగ్‌కు కొంత విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ సెట్లోకి అడుగుపెట్టి, సినిమాను పూర్తిచేయడంపై దృష్టి పెట్టారు. రాజకీయ నేతగా ఆయన ఎంతో సింపుల్‌గా కనిపిస్తారు
వైట్ అండ్ వైట్ డ్రెస్, నెరిసిన జుట్టు, మెడలో ఎర్రతాడు వేసుకొని సింపుల్‌గా ఉంటారు. అయితే షూటింగ్ సమయంలో మాత్రం ఆకట్టుకునే విధంగా మారిపోతారు. ఈ మధ్య ఆయన బరువు కూడా తగ్గడంతో మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. ఇటీవల పవన్ కొత్త లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. వైట్ అండ్ వైట్ పంచె, షర్ట్, బ్లాక్ గాగుల్స్ వేసుకొని విమానం నుంచి దిగుతూ పవన్ నడుస్తున్న తాజా ఫొటో అందరిని ఆకట్టుకుంటుంది. అదే సమయంలో పవన్ వేసుకున్న చెప్పులు ‘నిక్ కామ్’ బ్రాండ్(Nick Cam Brand Slippers)కు చెందినవిగా తెలుస్తోంది. వాటి ధర కేవలం రూ. 7,000 రూపాయలుగా సమాచారం. ఓ స్టార్ హీరోగా, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ఈ చెప్పులు వాడడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం అంటున్నారు. గతంలో పవన్ ప్యారగాన్ Paragon చెప్పులతో ప్రచారానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.