HomeUncategorizedPawan Kalyan | ప‌వ‌న్ క‌ల్యాణ్ మోసం చేశారు.. ఆయ‌న ఆఫీసు ముందు ఆమ‌ర‌ణ దీక్ష...

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ల్యాణ్ మోసం చేశారు.. ఆయ‌న ఆఫీసు ముందు ఆమ‌ర‌ణ దీక్ష చేస్తా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pawan Kalyan | “నా బిడ్డకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గను” అంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి (Parvathi) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట తప్పారని (Jana Sena Party chief Pawan Kalyan) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగతానని హెచ్చరించారు.

అధికారంలోకి వ‌చ్చాక .. మొదటి సంతకం సుగాలి ప్రీతి (Sugali Preethi) ఫైల్‌ మీదే చేస్తాను అని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట తప్పారన్నారు. 14 నెలలు గడిచినా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, గిరిజనుల బాధలపై పవన్‌కు శ్రద్ధ లేదని విమర్శించారు. “ఏపీ హోంమంత్రి శ్రీకాంత్ (AP Home Minister Srikanth) పెరోల్ కోసం ఎంత శ్రద్ధ చూపారో మా కోసం కనీసం స్పందించ‌డం కూడా లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan | ప‌వన్ మాట త‌ప్పారు..

సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్ చేపడతానని తెలిపారు. కేసును సీబీఐకి CBI అప్పగించాలని మరోసారి డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రీతి కుటుంబం కోరుతోంది. 2017 ఆగస్టు 18 – కర్నూలు జిల్లా (Kurnool district), కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్​లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకున్నట్టుగా కనిపించింది.

అయితే, తల్లిదండ్రులు మాత్రం ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. 2020లో ప్రతిపక్ష నేతగా పవన్ కల్యాణ్ ప్రీతి కుటుంబాన్ని కలిశారు. మా ప్రభుత్వం వస్తే మొదటి కేసు ఇదేనని సభల్లో హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో కూడా ఈ కేసును గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కూడా 2020లో కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. GO 37 ద్వారా సీబీఐకి కేసు అప్పగించే ప్రకటన చేశారు.

కానీ సీబీఐ మాత్రం “లెటర్ రాలేదు”, “వనరుల లేవు” అంటూ కేసు తీసుకోలేదు. 2024 ఆగస్టు 27న హోంమంత్రి అనిత (Home Minister Anitha)తో పార్వతి భేటీ కాగా, “సీఐడీకి కేసు అప్పగిస్తాం, రీ-ఓపెన్ చేస్తాం” అని హామీ ఇచ్చారు.కానీ జీవో ఇంకా విడుదల కాలేదు. కేసు ప్రస్తుతం స్థానిక పోలీసుల వద్దే ఉంది.నిందితులు బెయిల్‌పై బయట తిరుగుతున్నారు.కేసును సీబీఐకి అప్పగించాలి. నిందితులకు కఠిన శిక్షలు ప‌డాలి, వాగ్దానాలు కాదు – కార్యాచరణ కావాలి అంటూ సుగాలి ప్రీతి త‌ల్లి డిమాండ్ చేస్తుంది.