అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Deputy CM Pawan Kalyan | ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో ఒక సంఘటన టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా అలాంటి ఘట్టం 2023 సెప్టెంబర్ 9 న చోటుచేసుకుంది.
ఆ రోజు మాజీ సీఎం చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ అధికారులు(ACB Officers) అరెస్టు చేశారు. ఆయనను కర్నూలు నుంచి విజయవాడకు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, నేరుగా హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడకు రావాలని ప్రయత్నించారు. అయితే అనుమతి నిరాకరించడంతో, ఆయన రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు.
Deputy CM Pawan Kalyan | సరిహద్దులో అడ్డుకట్ట
ఏపీ, తెలంగాణ సరిహద్దులో పవన్ కాన్వాయ్(Pawan Convoy)ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ రోడ్డుపై బైఠాయించారు. జనసేన కార్యకర్తలు భారీగా ఆందోళనకు దిగగా, పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చివరకు పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆయన మనసులో గాఢ ముద్ర వేసింది. కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అక్కడి నుంచే తెలుగుదేశం–జనసేన పొత్తు రూపుదిద్దుకుంది. ఆ తరువాత బీజేపీని కూడా ఒప్పించి కూటమిని బలోపేతం చేశారు. ఈ కూటమి చివరకు ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి గట్టి ఎదురు దెబ్బ ఇచ్చింది.
అంతకుముందే పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. విశాఖ పర్యటనను అడ్డుకోవడం, హోటల్‌కే పరిమితం చేయడం, ఎయిర్‌పోర్టులో జనసైనికులపై దాడులు జరగడం, కేసులు నమోదు చేయడం.. ఈ చర్యలతో ఆయనలో వైసీపీపై వ్యతిరేకత మరింత పెరిగింది. చంద్రబాబు (Chandrababu Naidu) అరెస్టు, తనను అడ్డుకోవడం పవన్ కళ్యాణ్‌లోని ఆగ్రహాన్ని మరింతగా రగిలించాయి. ఈ సంఘటన జరిగి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో, 2023 సెప్టెంబర్ 9 దృశ్యాలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. జనసేన కార్యకర్తలు “అదే కూటమి టర్నింగ్ పాయింట్” అంటూ వీడియోలు, పోస్టులు షేర్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, సెప్టెంబర్ 9 ఘటన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మలుపు మాత్రమే కాకుండా, ఏపీ రాజకీయ సమీకరణాలకే టర్నింగ్ పాయింట్ అయింది.