HomeUncategorizedRation Cards | రేషన్ పంపిణీలో భారీ మార్పులు.. ఇక నుండి రాత్రి 8 గంటల...

Ration Cards | రేషన్ పంపిణీలో భారీ మార్పులు.. ఇక నుండి రాత్రి 8 గంటల వ‌ర‌కు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Cards | ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం (AP Government) పేద‌లకు అనేక స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్రతీ పేద కుటుంబానికి రేషన్ దుకాణాల (Ration Shops) ద్వారా నిత్యావసర సరకులు అందించడమే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం (TDP-Jana Sena-BJP coalition government) లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూన్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న‌ట్టు తెలియ‌జేశారు. ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాల్లో రేషన్ పంపిణీ కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Ration Cards | కీల‌క నిర్ణయం..

నెలలో 15 రోజులపాటు ఈ నిత్యావసర సరుకులను రేషన్ కార్డుదారులకు (ration card holders) అందజేయనుండ‌గా, ఈ 15 రోజుల పాటు కూడా రెండు పూటలా పంపిణీ ఉంటుంది. ఈ మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేర్పులను చేపట్టింది. ఈ రూల్స్ జూన్ నుంచే అమలులోకి రానున్నాయి. కూటమి సర్కారు ప్రవేశపెట్టిన కొత్త రేషన్ పంపిణీ పద్ధతి (new ration distribution system) ద్వారా రేషన్ డీలర్ల దుకాణాల వద్ద రద్దీని తగ్గించడమే కాకుండా.. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ సరుకులు అందేలా ఉంటుంద‌ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వివరించారు. అంతేకాకుండా దివ్యాంగులు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు.. వారి ఇంటి వద్దనే రేషన్ సరకులు అందించే సౌకర్యాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu government) కల్పించినట్లు తెలిపారు.

వైసీపీ (YSRCP) హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ గురించి మాట్లాడిన‌ పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వం (YSRCP government) పేదలకు రేషన్ సరుకులు అందించే చౌకధరల దుకాణాలను మూసివేసిందని ఆయ‌న గుర్తు చేశారు. ఇంటింటికీ రేషన్ సరుకులు అందిస్తామని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారని.. కానీ ఇంటింటికీ రేషన్ ఇవ్వడం మానేసి.. నెలలో కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనాన్ని ఉంచి.. రేషన్ సరుకులు ఇచ్చినట్లు ప‌వన్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి కూడా మాట్లాడిన ప‌వ‌న్.. రేషన్ షాపుల్లో Ration Shop మిగిలిపోయిన బియ్యం, ఇతర సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని వెల్లడించారు.