అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటిస్తున్నక్రేజీ ప్రాజెక్ట్‌లలో ‘హరి హర వీరమల్లు’ కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో huge budget పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట క్రిష్ krish మొదలు పెట్టారు. ఆ తర్వాత పలు కారణాల వలన ఆయన వైదొలిగారు. దాంతో జ్యోతికృష్ణ jyothi krishna దర్శకత్వ బాధ్యతలు అందిపుచ్చుకున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు Hari Hara Veeramallu పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ sword vs spirit పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు fans కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. దాదాపు 12 సార్లు ఈ మూవీ movie రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చారు.
Hari Hara Veeramallu | ఇక ఆగేదే లేదు..
ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ movie release కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ political life కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వాయిదా విషయంలో రికార్డు కొట్టింది ఈ మూవీ. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ మూవీ షూటింగ్ movie shooting చివరకు పూర్తయింది. చివరి రెండు రోజుల చిత్రీకరణకు పవన్ కళ్యాణ్ pawan kalyan హాజరయ్యారు. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెట్లో పవన్ కళ్యాణ్ టెక్నికల్ టీం Technical team సభ్యులతో కలిసి దిగిన ఫోటో షేర్ చేయడంతో , అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్నో రోజులుగా ఎదురు చేస్తున్న క్షణం వచ్చేసిందని ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు post production works త్వరగా ముగించేందుకు టీం శరవేగంగా కృషి చేస్తోంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ Nidhi Agarwal నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి MM Keeravani ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మే 30 లేదా జూన్ రెండో వారంలో ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశముందని ఫిలింనగర్ Film Nagarవర్గాల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో, ట్రైలర్‌ను trailer కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు.