HomeసినిమాOG Success meet | ఓజీ' సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. సినిమాని...

OG Success meet | ఓజీ’ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. సినిమాని చంపొద్దంటూ రిక్వెస్ట్‌

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: OG Success meet | సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘ఓజీ’ భారీ విజయాన్ని అందుకుంది.

సెప్టెంబరు 25న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూ వారం రోజుల్లోనే రూ. 300 కోట్లకు చేరువగా కలెక్షన్లను రాబడుతోంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన సినిమాల పట్ల అభిమానుల ఆదరణ చూస్తుంటే, తనపై ఉన్న బాధ్యత మరింత పెరిగినట్టు అభిప్రాయపడ్డారు.

“నాకు గన్స్ అంటే ప్రేమ. మద్రాస్ రైఫిల్ క్లబ్‌కి నేను మెంబర్​ని. ఓసారి గన్ పట్టుకుని ఫొటో తీయమన్నారు.. ఆ ఫొటో తీయడమే కాదు, ప్రతి మనిషికి ఒక సున్నితమైన కోణం ఉంటుందంటూ” తన వ్యక్తిత్వాన్ని వెల్లడించారు.

OG Success meet | ఎమోష‌న‌ల్ స్పీచ్​..

“ఓజీ OG చిత్రం నాకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. నేను, సుజీత్ Sujeeth గారు కలిసి చేసిన ఒక గొప్ప ప్రయోగం ఇది. గ్యాంగ్‌స్టర్ల ప్రపంచంలో ఉన్న ఓ తండ్రి కథను చాలా ఎమోషనల్‌గా చెప్పారు. సినిమా సక్సెస్ అయినా, ఫెయిలైనా నాకు తేడా లేదు. కానీ నా టీమ్, అభిమానుల కోసం ఎంత కష్టమైనా పడతా.. అని అన్నారు.

‘జానీ’ సినిమా సమయంలో ఎదురైన స‌మ‌స్య‌లని గుర్తుచేసుకుంటూ, “అప్పుడు నన్ను ఎవరూ నమ్మలేదు. నువ్వే రాసుకుని నువ్వే నటించు అని చెప్పేవారు. కానీ నేడు అదే నమ్మకంతో ఓజీ చేశాను..” అని తెలిపారు.

“అందరు దర్శకులు పవన్ కళ్యాణ్‌ను ఎలివేట్ చేయాలనుకుంటారు. కానీ సుజీత్ నాకు ఓ తండ్రి కథ చెప్పారు. యాక్షన్‌తో పాటు ఈ చిత్రంలో ఓ కుటుంబ కథను ఎంతో హృదయపూర్వకంగా చూపించారు. ఇది ఆ డైరెక్టర్ గొప్పతనాన్ని చూపుతుంది..” అని అన్నారు.

పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, “సినిమా కంటే నేను ఇప్పుడు చేస్తున్న పని పెద్దది. రియల్ లైఫ్‌లో తల ఎగిరిపోవచ్చు. ఆ రిస్క్ తీసుకునే ధైర్యం నా అభిమానులే ఇచ్చారు..” అని ఉద్వేగభరితంగా చెప్పారు.

“సినిమా విడుదలయ్యే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ వల్ల ఎంతటి ఒత్తిడి వస్తుందో తెలియదు. మేము పడే కష్టాన్ని ఎవరూ చూడరు. అంత కష్టపడి తీసిన ‘అత్తారింటికి దారేది’ నెట్‌లో లీక్ అయితే.. మా బాధ ఎవరిదీ కాదు. ఈ కల్చర్ మారాలి..” అని సూచించారు.

అంద‌రం హీరోలు క‌లిసి ఉంటాం. ఈ ఫ్యాన్ పేరుతో మీరు సినిమాల‌ని చంపేయొద్దు.. అని అంద‌రు హీరోల అభిమానుల‌కి రిక్వెస్ట్ చేశారు.

ఓజీకి సీక్వెల్ అయినా, ప్రీక్వెల్ అయినా చేయడానికి సుజీత్‌కి మాటిచ్చాను. కానీ అది చాలా షరతులకు లోబడి ఉంటుంది అని ప‌వ‌న్ తెలిపారు.

తమన్ Thaman చిన్న వయసులో తన తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సినిమా ఓ తండ్రి కథ అనగానే, అతడు తన తండ్రికి అంకితం చేసినట్టు అనిపించింది అని అభినందించారు.