HomeUncategorizedPawan Kalyan | నా మూవీ టిక్కెట్ రూ.10కి అమ్మారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్...

Pawan Kalyan | నా మూవీ టిక్కెట్ రూ.10కి అమ్మారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ‘హరిహరవీరమల్లు’ సినిమా(Hari Hara Veeramallu Movie) ఈ నెల 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న విష‌యం తెలిసిందే. చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఇక మొదట ఈ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ(Director Jyothi Krishna) బాధ్యతలు చేపట్టారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు. గ‌త రాత్రి హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre Release Event) ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో మాట్లాడుతూ .. “తెలంగాణలో సభకి పర్మిషన్ ఇచ్చిన సీఎంకి ధన్యవాదాలు. పాలిటిక్స్‌లో మంచి స్నేహితుడిని సంపాదించుకున్నా… ఆయనే ఈశ్వర్‌,” అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan | ఎమోష‌న‌ల్ కామెంట్స్..

ఇక ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) హృద‌యానికి హ‌త్తుకునే కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ‘నాకు డబ్బు ముఖ్యం కాదు.. బంధాలే ముఖ్యం అని’ అన్నారు. ‘నా గుండెల్లో అభిమానులు తప్ప ఇంకా ఎవరూ కూడా లేరు. ఆయుధాలు.. గూండాలు నాదగ్గర లేవు. వయసు పెరిగింది కానీ, గుండెల్లో చావ ఇంకా చావలేదు అంటూ’ ఆస‌క్తికర కామెంట్స్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. నేను ఏ రోజు కూడా డ‌బ్బుకి ప్రాధాన్యత ఇవ్వ‌లేదు. కేవ‌లం బంధాల‌కే ప్రాముఖ్యత ఇచ్చాను. మీ గుండె నుండి నా గుండెకి రెండు అడుగులు దూరం అంతే. నాకు పేరున్నా, ప్ర‌ధాన మంత్రి తెలిసినా నాకు డ‌బ్బులు రావు. నేను ఒక ఫ్లాప్ చేయ‌డం వ‌ల‌న ఇండ‌స్ట్రీలో గ్రిప్ మిస్ అయింది. ఆ టైమ్‌లో న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చి నాకు స‌పోర్ట్ ఇచ్చింది త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.

కొత్త కథలు తీస్తే.. నా భార్యను, పిల్లలను ఎవరు పోషించాలి? నా పార్టీని ఎవరు నడపాలి? నాకు దేశం పిచ్చి.. సమాజ బాధ్యత పిచ్చి ఎక్కువ అని పేర్కొన్నారు. హరిహరవీరమల్లు నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్. భారత్‌ ఎవరినీ ఆక్రమించుకోలేదు.. అందరూ ఈ దేశాన్ని ఆక్రమించారు అని అన్నాడు. ఈ సినిమా కోసం నేను రోజుకు రెండు గంటల స‌మ‌యం మాత్ర‌మే కేటాయించా. ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ వారానికి ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేశా. జ్యోతికృష్ణ ఎంతో నమ్మకంగా సినిమాను ముందుకు నడిపారు. నిధి అగర్వాల్‌(Heroine Nidhi Agarwal)ని చూసి నాకు సిగ్గు వేసి, నేను ప్రమోషన్స్‌కి వచ్చాను అని ప‌వ‌న్ అన్నారు. హరిహరవీరమల్లు ధర్మాన్ని చెప్పే సినిమా.. ఇది సస్పెన్స్ మూవీ కాదు.. కానీ గుండెల్ని తాకే కథ” అని స్పష్టం చేశారు. “కలెక్షన్ల సంగతి నాకు తెలియదు. కానీ బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చా. డ్యాన్సులు చేశా.. ఫైట్స్‌ చేశా.. క్లైమాక్స్‌ను నేనే కంపోజ్ చేశా అని పవన్ తెలిపారు.

Must Read
Related News