అక్షరటుడే, ఆర్మూర్ : St Pauls School Protest | విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేయవద్దని సెయింట్ పాల్ హైస్కూల్ (St. Paul High School) ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఓ ప్రైవేట్ బ్యాంకు లోన్ రికవరీ (Loan Recovery) పేరుతో పాఠశాల భవనాన్ని జప్తు చేస్తున్నారన్న విషయం తెలుసుకొని బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు.
St Pauls School Protest | కోర్టులో చూసుకోవాలి..
పాఠశాల యాజమాన్యం, ప్రైవేట్ బ్యాంకు ఆర్థిక లావాదేవీలు కోర్టులో చూసుకోవాలని విద్యార్థులకు పరీక్షల సమయం సమీపిస్తున్నందున విద్యార్థుల జోలికి రావొద్దన్నారు. సెయింట్ పాల్ స్కూల్‌కు తాళం వేయడం సరికాదన్నారు. స్కూల్ ప్రాంగణంలోకి పోలీసులు చేరుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
St Pauls School Protest | విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన గురికావద్దు..
క్రెడిట్ స్కోర్ ఆధారంగా అవసరంలేని మొత్తాన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లోన్ ఇచ్చిందని సెయింట్ పాల్స్ స్కూల్ యాజమాని ఎనోక్ పాల్ తెలిపారు. వాయిదాల వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నప్పటికీ ప్రైవేట్ బ్యాంకు ఫ్లోటింగ్ రేటు వడ్డీతో అదనపు డబ్బులను వసూలు చేసిందని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రైవేట్ బ్యాంకు వారిని వివరాలు కోరగా దాటవేస్తూ పొంతన లేని సమాధానాలు చెబుతోందన్నారు. ప్రైవేట్ బ్యాంకు (Private Bank) ఆగడాలను చట్టపరంగా ఎదుర్కొనేందుకే రుణ రికవరీ ట్రిబ్యునల్ కోర్టులో పిటిషన్ వేశామన్నారు. ట్రిబ్యునల్ కోర్టు ప్రైవేటు బ్యాంకుకు మార్చి 12లోపు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిందన్నారు. డీఆర్టీ ఇచ్చిన నోటీసులను ప్రైవేట్ బ్యాంకు బేఖాతరు చేస్తూ, తప్పుడు ఆధారాలతో కోర్టు నోటీసులు ఉన్నాయని చెప్పి స్కూల్‌ను సీజ్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పదిహేను రోజుల ముందు తమకు నోటీసులు జారీ చేయకుండా పాఠశాల కార్యాలయానికి తాళం వేశారన్నారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వమని వారు వివరించారు. వారి వెంట హైకోర్టు అడ్వకేట్ భానోదయ, పాఠశాల కుటుంబ సభ్యులు సేసిలియా ఎనోక్, కేథరిన్ పాల్ ఉన్నారు.
