HomeUncategorizedPatna | ప‌ట్నాలో వాట‌ర్ మెట్రో స‌ర్వీసులు.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..!

Patna | ప‌ట్నాలో వాట‌ర్ మెట్రో స‌ర్వీసులు.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Patna | బీహార్‌లో ఈ ఏడాది చివ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు (Assembly Elections) జ‌ర‌గ‌నున్నాయి.ఈ నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర రాజ‌ధాని ప‌ట్నాలో వాట‌ర్ మెట్రో సేవలు (water metro services) త్వరలో ప్రారంభం కానున్నాయనే ఈ విషయాన్ని కేంద్ర రవాణా, నౌకాశ్రయ మరియు జల మార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal) ప్రకటించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డంతో దీనిపై హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Patna | ఎన్నో ఆశ‌లు..

సోనోవాల్ మాట్లాడుతూ.. కార్గో, ప‌ర్యాట‌కం, స్థానిక జీవ‌నోపాధి కోసం నదీ వ్య‌వ‌స్థ‌ల పూర్తి సామ‌ర్థ్యాన్ని ఉప‌యోగించుకునేందుకు మోదీ ప్ర‌భుత్వం(PM Modi Governament) క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. వాట‌ర్ మెట్రో ప‌ట్నాకు మరో ఆధునిక ర‌వాణా వ్య‌వ‌స్థ‌ని అందించ‌నుంద‌ని తెలిపారు. దీనికి నేష‌న‌ల్ ఇన్లాండ్ నావిగేష‌న్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేయ‌నుంద‌ని తెలిపారు. గంగానది ఒడ్డున ఉన్న బీహార్ (Bihar) .. దేశంలో అత్యంత జ‌ల‌మార్గ ర‌వాణా కేంద్రంగా ఉద్భ‌వించ‌నుంద‌ని పేర్కొన్నారు. జల మార్గాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు సోనోవాల్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు నది మార్గాల ద్వారా సరుకు, పర్యాటక మరియు స్థానిక జీవనాధారాల కోసం అని తెలిపారు.

బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి (Bihar Deputy CM Samrat Chaudhary) మాట్లాడుతూ.. “గంగా నది ఒడ్డున ఉన్న జిల్లాల్లో కనెక్టివిటీ, పర్యాటక మరియు వాణిజ్య రంగాలను మెరుగుపరచడానికి జల మార్గాల అభివృద్ధి కీలకమని” తెలిపారు. భగల్‌పూర్‌లో బహుళ మోడల్ టెర్మినల్ నిర్మాణం మరియు నౌక మరమ్మతుల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ వాట‌ర్ మెట్రో సేవలు పాట్నాలో పట్టణ రవాణాను సమర్థవంతంగా మార్చి, రోడ్డు ట్రాఫిక్‌ను (Road Traffic) తగ్గించడంలో సహాయపడతాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చే ఈ వాట‌ర్ మెట్రో యువ‌త‌కి ప్రత్య‌క్షంగా ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పించ‌నుంది.