Homeబిజినెస్​IPO Listing | అదరగొట్టిన పటేల్‌ రిటైల్‌.. పరవాలేదనిపించిన విక్రమ్‌ సోలార్‌

IPO Listing | అదరగొట్టిన పటేల్‌ రిటైల్‌.. పరవాలేదనిపించిన విక్రమ్‌ సోలార్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO Listing | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం నాలుగు మెయిన్‌ బోర్డ్‌ (Main board) కంపెనీలు లిస్టయ్యాయి. మార్కెట్లు భారీ నష్టాలతో సాగుతున్నా పాజిటివ్‌గానే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇందులో పటేల్‌ రిటైల్‌ (Patel Retail) 17 శాతానికిపైగా రిటర్న్స్‌ ఇవ్వగా.. శ్రీజి షిప్పింగ్‌ 7 శాతానికిపైగా ప్రారంభ లాభాలను అందించింది. విక్రమ్‌ సోలార్‌ కంపెనీ లిస్టింగ్‌ తర్వాత పుంజుకుని ఇన్వెస్టర్లకు ఆనందాన్ని పంచింది.

IPO Listing | పటేల్‌ రిటైల్‌

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 242.76 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పటేల్‌ రిటైల్‌ కంపెనీ (Patel Retail Company) ఐపీవోకు వచ్చింది. కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ (Subscription) 19న ప్రారంభమై 21న ముగిసింది. కంపెనీ షేర్లు 26న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 255 కాగా.. రూ. 45 ప్రీమియంతో రూ. 300 వద్ద లిస్ట్‌ అయ్యింది. అంటే ఐపీవో (IPO) ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌ సమయంలోనే 17.65 శాతం లాభాలను అందించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 32.70 లాభంతో రూ. 287.70 వద్ద స్థిరపడిoది.

IPO Listing | విక్రమ్‌ సోలార్‌

విక్రమ్‌ సోలార్‌ (Vikram Solar) కంపెనీ రూ. 2,079.37 సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌ 19 ప్రారంభమై 21న ముగిసింది. కంపెనీ షేర్లు 26న లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 332 కాగా.. రూ. 6 ప్రీమియంతో (Premium) రూ. 338 వద్ద లిస్టయ్యాయి. లిస్టింగ్‌ సమయంలో ఐపీవో ఇన్వెస్టర్లకు 1.81 శాతం లాభాలను మాత్రమే అందించింది. అయితే ఆ తర్వాత కోలుకుని పైకి పెరిగింది. ఇంట్రాడేలో రూ. 381 వరకు పెరిగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 24.4 లాభంతో రూ. 356.41 వద్ద ఉంది.

IPO Listing | శ్రీజి షిప్పింగ్‌ గ్లోబల్‌

మార్కెట్‌నుంచి రూ. 410.71 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో శ్రీజి షిప్పింగ్‌ గ్లోబల్‌ (Shreeji Shipping Global) కంపెనీ ఐపీవోకు వచ్చింది. పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 19-21 మధ్య కొనసాగింది. మంగళవారం కంపెనీ షేర్లు లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 252 కాగా.. రూ. 18 ప్రీమియంతో రూ. 270 వద్ద లిస్టయ్యాయి. ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 7.14 శాతం రిటర్న్స్‌ అందించాయి. లిస్టింగ్‌ తర్వాత షేరు ధర పడిపోయింది. తొలి రోజు రూ. 3.1 లాభంతో రూ. 255.10 వద్ద స్థిరపడిoది.

IPO Listing | జెమ్‌ ఎరోమాటిక్స్‌

రూ. 451.25 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో జెమ్‌ ఎరోమాటిక్స్‌ (Gem Aromatics) కంపెనీ ఐపీవోకు వచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 19 నుంచి 21 వరకు కొనసాగింది. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 325 కాగా.. రూ. 8 లాభంతో రూ. 333 వద్ద లిస్టయ్యింది. అంటే లిస్టింగ్‌ సమయంలో 2.49 శాతం లాభాలను అందించింది. ఆ తర్వాత రూ. 249 వరకు పెరిగినా.. నిలదొక్కుకోలేక పోయింది. చివరికి రూ. 5.95 నష్టంతో రూ. 319.05 వద్ద నిలిచింది.