అక్షరటుడే, వెబ్‌డెస్క్: Patanjali | పతంజలి గ్రూపునకు చెందిన పతంజలి ఫుడ్స్ (Patanjali Foods) బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. తన కంపెనీలో ఒక షేరు కలిగి ఉన్నవారికి రెండు షేర్లను బోనస్‌గా ఇవ్వాలని యోచిస్తోంది. 2:1 నిష్పత్తిలో బోనస్() షేర్లు జారీ చేయనుంది.
ఈమేరకు బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కంపెనీ బోనస్ షేర్లను (Bonus Sahres) ప్రకటించడం ఇదే మొదటిసారి. రికార్డు డేట్‌ను (Record date) ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంచ్ ఫైలింగ్స్‌లో పేర్కొంది. రూ.2 ఫేస్ వాల్యూ(Face value) కలిగిన 72,50,12,628 షేర్లను జారీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. రెండు నెలలలోపు బోనస్ షేర్ల జారీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది.
Patanjali | ఇన్వెస్టర్లకు లాభాలపంట..
దివాలా అంచున ఉన్న రుచి సోయాను (Ruchi soya) పతంజలి ఆయుర్వేద 2019లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పతంజలి కొనుగోలు చేయడంతో షేరు మల్టీ బ్యాగర్‌గా (Multi bagger) మారింది. అప్పటివరకు రూ.20లోపు ఉన్న షేరు ప్రస్తుతం రెండు వేల రూపాయలకు చేరువలో ట్రేడ్ అవుతోంది.
బోనస్ ప్రకటన తర్వాత కంపెనీ షేర్లు ర్యాలీ తీశాయి. రెండు రోజుల్లోనే రూ.90 వరకు పెరిగి రూ.1,941 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం మార్కెట్లు నెగెటివ్‌గా ఉన్నా.. పతంజలి షేర్ మాత్రం లాభాలతో కొనసాగుతుండడం గమనార్హం.