ePaper
More
    HomeజాతీయంSpiceJet flight | గాల్లో ఉండగా ఊడిన‌ స్పైస్‌జెట్ కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికుల్లో భయాందోళన

    SpiceJet flight | గాల్లో ఉండగా ఊడిన‌ స్పైస్‌జెట్ కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికుల్లో భయాందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: SpiceJet flight | గోవా నుంచి పుణెకు (Goa to Pune) వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం గాల్లో ఉన్నపుడే ఒక కిటికీకి సంబంధించిన లోపలి ఫ్రేమ్ ఊడిపోవడం కలకలం రేపింది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా (passengers) ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి దుర్ఘటన జరగకుండానే విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరినప్పటికీ, ఈ ఘటన విమానయాన భద్రతపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మంగళవారం స్పైస్‌జెట్‌కు చెందిన Q400 రకం విమానం (SpiceJet Q400 aircraft) గోవా నుంచి పుణెకు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణం మధ్యలో ఓ ప్రయాణికుడు కిటికీ పక్కన ఉన్నప్పుడు ఆ కిటికీకి పైభాగంలో అమర్చిన “కాస్మెటిక్ కవర్” (లోపలి కిటికీ ఫ్రేమ్) ఒక్కసారిగా ఊడిపడింది. ఈ అనూహ్య పరిణామంతో సదరు ప్రయాణికుడితో పాటు సమీపంలోని ఇతరులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు.

    READ ALSO  Fake Votes | న‌కిలీ ఓట్లు వేయ‌డానికి అనుమ‌తించాలా? ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌పై సీఈసీ అస‌హ‌నం

    SpiceJet flight | ఇలా ఊడిందేంటి..

    విమానం గాల్లో ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన కారణంగా ప్రయాణికులలో (passengers) తీవ్ర ఆందోళన నెలకొంది. “విమాన కిటికీ ఊడిపోతే ఏం జరుగుతుందో?” అనే భయం వారికి కలిగింది. అయితే అది కేవలం కిటికీకి అటాచ్ చేసిన లోపలి డెకరేటివ్ ఫ్రేమ్ మాత్రమేనని స్పైస్‌జెట్ యాజమాన్యం (SpiceJet management) వివరించింది. కాగా.. ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. సంఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది. అలాగే, టెక్నికల్ సమస్య, మెయింటెనెన్స్ లోపం, మానవ తప్పిదం ఏదైనా ఉన్నాయా అనే కోణాల్లో విచారణ ప్రారంభించింది.

    ఈ సంఘటనపై విమాన ప్రయాణికుల సంఘాలు (Air passenger associations) స్పందించాయి. ఇది చిన్న విషయంగా ముగిసింది. కానీ గాల్లో ఉన్నప్పుడు జరిగిన ఈ తరహా లోపం ప్రయాణికులకు భద్రతా విషయంలో ఎన్నో సందేహాలు కలిగిస్తోంది. ఇలాంటివి సహించరాని పరిస్థితిలో ఉన్నాం అంటూ హెచ్చరిక‌లు జారీ చేశాయి. అయితే ఘటన అనంతరం ప్రయాణికులు తమ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. “విమానం ఆకాశంలో వెళ్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరిగితే, మన భద్రత ఎవరి భాద్యత?” అంటూ ప్రశ్నిస్తున్నారు. DGCA ఇప్పటికే విచారణ ప్రారంభించగా, స్పైస్‌జెట్ (Spicejet) కూడా ఈ సంఘటనపై అంతర్గత నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రిపోర్ట్ ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోనున్నారు.

    READ ALSO  Vice President | ఉప రాష్ట్రపతి ధన్​ఖడ్​ రాజీనామాకు ఆమోదం

    Latest articles

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    More like this

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...