అక్షరటుడే, హైదరాబాద్: Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు (Passengers ) ఆందోళన(passenger protest)కు దిగారు. కాసేపు నిరసన చేపట్టారు.
తిరుపతి(Tirupati) వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం(SpiceJet flight) రద్దు కావడంతో ఈ సమస్య తలెత్తింది. ముందస్తు సమాచారం లేకుండా విమానం రద్దు చేయడమేంటని ప్రయాణికులు మండిపడ్డారు. కాగా, వారి ఆందోళనను స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విమానాశ్రయంలోనే 35 మంది ప్రయాణికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తిరుపతి ఫ్లైట్స్ విషయంలో తరచూ ఇలా ఆలస్యం కావడం, ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడం జరుగుతుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు చేసుకోవడం ఇది మూడోసారిగా పేర్కొంటున్నారు.