అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Death to Trump | విమానం గాలిలో ఉండగా.. ఓ ప్రయాణికుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఓ వ్యక్తి ఒక్కసారిగా లేచి విమానంలో బాంబు పెట్టినట్లు అరిచాడు. దీంతో మిగతా వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లండన్ లూటన్ ఎయిర్‌పోర్టు (London Luton Airport) నుంచి గ్లాస్గోకు వెళ్తున్న ఈజిజెట్ ఎయిర్‌లైన్స్ విమానంలో (EasyJet Airlines plane) ఈ ఘటన చోటు చేసుకుంది.
విమానం టేకాఫ్ అయ్యాక.. గాలిలో ఉండగా ఓ వ్యక్తి లేచాడు. తాను విమానాన్ని పేల్చేస్తానంటూ అరవడం ప్రారంభించాడు. ఫ్లైట్‌లో బాంబు (Bomb on a Flight) పెట్టానని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బందిని అతడితో మాట్లాడడానికి యత్నించగా.. బాంబు తీస్తానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Death to Trump | బంధించిన ప్రయాణికులు
విమానంలో సదరు వ్యక్తి అమెరికాకు మరణం.. ట్రంప్‌కు మరణం (Death to Trump) అంటూ అరవడం గమనార్హం. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. అయితే ఓ వ్యక్తి ధైర్యం చేసి అతడిని కిందపడేశారు. దీంతో మిగతా ప్రయాణికులు అతడిని బంధించారు. అనంతరం విమానం గ్లాస్గో ఎయిర్‌పోర్టులో (Glasgow Airport) ల్యాండ్ కాగానే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు అలా ఎందుకు అరిచాడని దర్యాప్తు చేస్తున్నారు.
‘DEATH to Trump’ and ‘ALLAHU AKBAR’ — man causes panic on flight
Says he’s going to ‘BOMB the plane’
SLAMMED to ground by passenger pic.twitter.com/mVYwXqx7Yr
— RT (@RT_com) July 27, 2025