HomeతెలంగాణPassenger pushes siblings | దారుణం.. అన్నదమ్ముల్ని రైల్లోంచి తోసేసిన ప్రయాణికుడు

Passenger pushes siblings | దారుణం.. అన్నదమ్ముల్ని రైల్లోంచి తోసేసిన ప్రయాణికుడు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Passenger pushes siblings | గ్రేటర్​ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన దక్షిణ ఎక్స్‌ప్రెస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ముల్ని ఓ ప్రయాణికుడు రైలులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో వారిలో ఒకరు మరణించారు. ఇంకొకరు కోమాలోకి వెళ్లారు.

Passenger pushes siblings | ఘట్‌కేసర్ పరిధిలో..

ఈ దారుణ ఘటన మహా నగర శివారులోని ఘట్‌కేసర్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితులను మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు.

రైళ్లో నుంచి తోసేసిన తీరుకు తమ్ముడు(30) తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మరణించాడు. అన్న(33) కోమాలోకి వెళ్లాడు. ఉస్మానియా ఆసుపత్రిలో అన్నకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.