Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలి

Nizamabad Collector | పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలి

పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో విద్యాశాఖ (education department) పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, పాఠశాలలో నెలకొన్న స్థితిగతులు, బోధన తీరు, సదుపాయాల కల్పనపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు (special classes) నిర్వహించాలన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎవరైనా గైర్హాజరయితే అదేరోజు సాయంత్రంలోపు తల్లిదండ్రులకు సమాచారం అందించి కౌన్సిలింగ్ చేయాలని చెప్పారు. అలాగే వయోజన విద్య విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. జిల్లాలో 59 వేల మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వీలుగా 5900 మంది విద్యా వాలంటీర్లకు (education volunteers) శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు.

Nizamabad Collector | స్క్రాప్​ను నిబంధనలు పాటిస్తూ డిస్పోజ్​ చేయాలి

పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న స్క్రాప్​ను నిబంధనలు పాటిస్తూ డిస్పోజ్​ చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. అవసరమైన చోట ఫర్నిచర్ మరమ్మతులు చేయించాలన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, విద్యుత్, నీటి వసతి తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలన్నారు. పెండింగ్​లో ఉన్న సివిల్ వర్క్స్​ను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో లోటుపాట్లకు తావు లేకుండా మెనూ ప్రకారం పౌష్టికాహారం (nutritious food) అందజేయాలన్నారు. భోజన ఏజెన్సీల నిర్వాహకులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు జరిపించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.