అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pashamylaram | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం(Congress government negligence) వల్లే పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఆరోపించారు. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన జరిగిన ప్రమాదంలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఘోర ప్రమాదం జరిగిందని, 40 మందికి పైగా మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ప్రమాదం జరిగి 36 గంటలు గడిచినా ఇంకా కొందరి ఆచూకీ లభించలేదని తెలిపారు.
Pashamylaram | భద్రతా చర్యలేవి?
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఫ్యాక్టరీ(Sigachi Chemical Factory)లో ప్రమాదం జరిగిందని కవిత ఆరోపించారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఫ్యాక్టరీలపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు గ్రీన్ ఛానెల్ ద్వారా మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు.