అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి (Yella Reddy RDO Parthasimha Reddy) గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన ప్రభాకర్ పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి (Banswada Sub Collector Kiranmayi) బాధ్యతలు అప్పజెప్పారు.
అనంతరం కామారెడ్డి ఆర్డీవో వీణకు ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా నారాయణ పేటలో (narayana peta) పని చేస్తున్న పార్థసింహారెడ్డిని ఎల్లారెడ్డి ఆర్డీవోగా బదిలీ చేశారు. గురువారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.