HomeUncategorizedDharmasthala | హిందుత్వపై కుట్ర‌లో భాగమే.. ధ‌ర్మ‌స్థ‌ల ఆరోప‌ణ‌ల‌పై హెగ్డే వ్యాఖ్య‌

Dharmasthala | హిందుత్వపై కుట్ర‌లో భాగమే.. ధ‌ర్మ‌స్థ‌ల ఆరోప‌ణ‌ల‌పై హెగ్డే వ్యాఖ్య‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Dharmasthala | హిందుత్వంపై జ‌రుగుతున్న కుట్ర‌లో భాగంగానే ధర్మస్థల క్షేత్రంపై త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని ధ‌ర్మ‌స్థ‌ల ట్ర‌స్టీ, బీజేపీ ఎంపీ వీరేంద్ర హెగ్డే(BJP MP Virendra Hegde) అన్నారు. ధ‌ర్మ‌స్థ‌ల‌ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఆరోపణలు, అపనిందలు, తప్పుడు ప్ర‌చార‌మంతా హిందూ మతం(Hinduism) సంప్రదాయాలను అణగదొక్కడానికి ఉద్దేశించిన ఒక పెద్ద కుట్రలో భాగమన్నారు.

ధ‌ర్మ‌స్థ‌ల‌(Dharmasthala)లో వంద‌లాది మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేశాన‌ని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా చేసిన ఆరోప‌ణ‌లు అస‌త్య‌మ‌ని తేలిన నేప‌థ్యంలో హెగ్డే తాజాగా స్పందించారు. ధ‌ర్మ‌స్థ‌ల ప్రాశ‌స్త్యాన్ని దెబ్బ తీసేందుకే దుష్ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. ఆయా ఆరోపణలన్నీ నిరాధారమైనవని నొక్కి చెప్పారు. “ఇప్పటివరకు 17 ప్రదేశాలను తవ్వారు, ఏమీ కనుగొనలేదు. హిందుత్వంపై జ‌రుగుతున్న కుట్ర‌లో భాగంగానే తాజా ఆరోప‌ణ‌లు చేశారు. మ‌న సంస్కృతి మీద జ‌రుగుతున్న దాడి విష‌యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి, మన మతాన్ని మనం కాపాడుకోవాలి” అని కోరారు.

Dharmasthala | విచార‌ణ జ‌ర‌పాలి..

మన సంస్కృతి, మతం, ఆధ్యాత్మిక బలానికి చిహ్నంగా భావించే ధ‌ర్మ‌స్థ‌ల‌పై దుష్ప్ర‌చారం చేసిన ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం లోతుగా ద‌ర్యాప్తు చేయాల‌ని మాజీ ఎమ్మెల్యే అశోక్ కటవే(Former MLA Ashok Katave) డిమాండ్ చేశారు. ఏ శక్తి కూడా ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించలేదన్నారు. ఆధ్యాత్మిక సేవలను నేరాలుగా, మతపరమైన భక్తి కేంద్రాలపై క్రమబద్ధమైన కుట్రగా చిత్రీకరించే ప్రయత్నాల్లో భాగ‌మే త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని తెలిపారు. ఈ దుష్ప్ర‌చారంపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలన్న ఆయ‌న.. ఈ వ్య‌వ‌హారంలో దోషులకు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తామ‌ని చెప్పారు. ఆయన అన్నారు.