ePaper
More
    HomeజాతీయంParliament | నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల​ సమావేశాలు.. దద్దరిల్లనున్న ఉభయ సభలు

    Parliament | నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల​ సమావేశాలు.. దద్దరిల్లనున్న ఉభయ సభలు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Parliament : పార్లమెంట్ వర్షాకాల monsoon session సమావేశాలు నేటి (జులై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం అవుతాయి. అంతకు ముందు అంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi ప్రసంగిస్తారు.

    పహల్గామ్​​ ఉగ్రదాడి (Pahalgaon terror attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఇది తొలి సెషన్ కావడం గమనార్హం. ఈ సెషన్​లో 12 బిల్లులకు ఆమోద ముద్ర కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది. కొత్తగా 8 బిల్లులు ప్రవేశ పెట్టనుంది.

    కాగా, పహల్గామ్​ దాడి, ఆపరేషన్ సిందూర్​పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని చూస్తోంది. ట్రంప్ TRUMP మధ్యవర్తిత్వంపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీయాలని చూస్తున్నాయి. ప్రధాని సమాధానం చెప్పాలని పట్టుబట్టే అవకాశం ఉంది. కాగా, ఆపరేషన్ సిందూర్​పై చర్చకు సిద్ధమని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

    Parliament : కొత్తగా ఎనిమిది బిల్లులు..

    ఈసారి పార్లమెంటులో కొత్తగా ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో..

    • నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు (National Sports Governance Bill)
    • మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు (Mines and Minerals (Development and Regulation) Amendment Bill)
    • జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రెలిక్స్ (పరిరక్షణ, నిర్వహణ) బిల్లు (Geo Heritage Sites and Geo Relics (Preservation and Management) Bill)
    • నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లు (National Anti-Doping Amendment Bill)
    • మణిపూర్ జీఎస్‌టీ సవరణ బిల్లు (Manipur GST Amendment Bill)
    • ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లు (he Indian Institute of Management Amendment Bill)
    • ది జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు (The Jan Vishwas Rules Amendment Bill)
    • పన్ను చట్టాల సవరణ బిల్లు (Tax Laws Amendment Bill) ఉన్నాయి.

    నేడు కేంద్ర సర్కారు ఆదాయపు పన్ను బిల్లు-2025ను లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టి, పరిశీలన నిమిత్తం లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ కమిటీ బుధవారం (జులై 16న) తన నివేదికను సబ్మిట్​ చేసింది.

    ఇక, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిని పొడిగించేందుకు కేంద్ర సర్కారు పార్లమెంటు అనుమతిని కోరనుంది.

    వీటికితోడు గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్‌టీల ప్రాతినిధ్య సవరణ బిల్లు – 2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు – 2025‌, మర్చంట్ షిప్ బిల్లు -2024 బిల్లులు లోక్‌సభ ఆమోదం కోసం పరిశీలనలో ఉన్నాయి.

    More like this

    Local Body Elections | ఎన్నెన్ని ‘కలలో’.. స్థానిక ఎన్నికల కోసం ఆశావహుల నిరీక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections)...

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...