అక్షరటుడే, ఇందూరు: Navya Bharati Global School | నగర శివారులోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో గురువారం విద్యార్థుల పార్లమెంటరీ ఎలక్షన్స్ (Parliamentary Elections) నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కెప్టెన్, ఎకో హెల్త్ కల్చరల్ పదవుల కోసం మొత్తం 14 మంది విద్యార్థులు పోటీ పడ్డారు.
ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ సంతోష్ కుమార్, కరస్పాండెంట్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, బాధ్యతగల పౌరునిగా ఎదగడం అలవడతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆంటోనీ, హెచ్ఆర్ లత, వైస్ ప్రిన్సిపాల్ సుధీర్, సరిత పాల్గొన్నారు.