ePaper
More
    HomeజాతీయంParliament sessions | నెల రోజుల పాటు పార్లమెంట్​ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చకు సిద్ధం

    Parliament sessions | నెల రోజుల పాటు పార్లమెంట్​ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చకు సిద్ధం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament sessions | పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించనుంది. జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు​ (Union Minister Kiren Rijiju) ‘ఎక్స్’​ వేదికగా ప్రకటించారు. సెలవు దినాల్లో సమావేశాలు ఉండవు. దీనికి తోడు స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో కూడా సమావేశాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

    Parliament sessions | కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం

    జమ్మూ కశ్మీర్​లోని (Jammu and Kashmir) పహల్గామ్​లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి (terrorists attacked) చేశారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor) చేపట్టి ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్​కు బుద్ధి చెప్పింది. అయితే పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam terror attack), ఆపరేషన్​ సిందూర్​ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వాటిపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

    భారత్​, పాక్​ (India – Pakistan) మధ్య తాను యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిని సభలో లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad plane crash) గురించి కూడా సభలో చర్చించే ఛాన్స్​ ఉంది.

    Parliament sessions | బీసీ రిజర్వేషన్​ బిల్లులు ఆమోదిస్తారా..

    రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress government) ప్రకటించింది. ఈ మేరకు స్థానిక ఎనికలతో (local elections) పాటు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించింది. వీటిని కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదిస్తేనే ఈ బిల్లులు చట్టం రూపం దాల్చనున్నాయి. వర్షాకాల సమావేశంలో ఈ బిల్లులను ఆమోదిస్తే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు (BC reservations) అవకాశం ఉంటుంది. సెప్టెంబర్​ 30లోపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను కేంద్రం ఆమోదిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

    More like this

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...