121
అక్షరటుడే, వెబ్డెస్క్ : Parliament Sessions | పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా.. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం (Central Government) బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను తీసుకువచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చతో పాటు 30 రోజల పాటు జైల్లో ఉన్నట్లయితే సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే కీలక బిల్లులపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందితే దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది.