Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Railway Station | రైల్వేస్టేషన్​లో పార్కింగ్​ ఫీజు బాదుడు..

Nizamabad Railway Station | రైల్వేస్టేషన్​లో పార్కింగ్​ ఫీజు బాదుడు..

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Railway Station | నగరంలోని రైల్వేస్టేషన్​లో పార్కింగ్​ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. స్టేషన్​ ప్రాంగణంలో పార్కింగ్​ కాంట్రాక్టర్ (Parking contractor)​ తీసుకున్న వ్యక్తులు వాహనదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

వాహనాలను పార్కింగ్​షెడ్​లో ఉంచినందుకు ఇష్టారాజ్యంగా లెక్కలు వెస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని వారంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి ఈనెల 15వ తేదీన హైదరాబాద్(Hyderabad)​ వెళ్తూ తన బైక్​ను రైల్వేస్టేషన్​ పార్కింగ్​ షెడ్​లో ఉంచాడు. అతడు తిరిగి గురువారం తిరిగొచ్చి బైక్​ కోసం వెళ్లగా పదిరోజులు షెడ్​లో ఉంచినందుకు కాగాను రూ.782 ముక్కుపిండి వసూలు చేశారు. పైగా తాము ఇంతేనని ఎవరినీ వదిలిపెట్టమని మాట్లాడాడని బాధితులు వాపోతున్నారు. నామమాత్రపు ఛార్జీలు వేస్తే ఏమికాదని.. ఇలా వందల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడం ఏమిటని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు.