అక్షరటుడే, వెబ్‌డెస్క్: Paris Louvre Museum | ఫ్రాన్స్ (France) లోని అందాల నగరం ప్యారిస్ (Paris) లో ఆదివారం (అక్టోబరు 19) ఉదయం దొంగలు బీభత్సం సృష్టించారు. వరల్డ్ ఫేమస్ లౌవ్రే (Louvre) మ్యూజియంలోకి చొరబడ్డారు.
హైడ్రాలిక్ ల్యాడర్(hydraulic ladder), చైన్ రంపంతో మ్యూజియంలోకి చేరుకున్నారు. దొంగల దాడితో ప్రఖ్యాత మ్యూజియం మూత పడటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
లౌవ్రే మ్యూజియంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు.. అధికారులను, సందర్శకులను భయపెట్టారు. నెపోలియన్ Napoleonic కాలం నాటి విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని ఫ్రాన్స్ మంత్రి లారెంట్ న్యూనెజ్ తెలిపారు. ప్యారిస్ చరిత్రలో ఇది పెద్ద దోపిడీగా పేర్కొన్నారు.
పక్కనే నిర్మాణంలో ఉన్న భవంతపై నుంచి దొంగలు మ్యూజియంలోకి చొరబడ్డారు. అపోలో గ్యాలరీలోని రాజవంశీయుల ఆభరణాలను దోచుకున్నారు. కేవలం ఏడు నిమిషాల్లోనే ఉన్నదంతా దోచుకుని పారిపోయారు.
నెపోలియన్ కాలం నాటి తొమ్మిది ఆభరణాలను అపహరించినట్లు ఫ్రెంచ్ డైలీ లె పరిసైన్ ప్రకటించింది. వీటిల్లో ఒకటి మ్యూజియం వెలుపల లభించినట్లు మంత్రి వెల్లడించారు.
Paris Louvre Museum | ప్రపంచంలోనే పేరొందిన మ్యూజియం:
ప్రపంచలోనే అత్యధిక సందర్శకులు వచ్చే మ్యూజియంగా లౌవ్రే మ్యూజియానికి పేరు ఉంది. దీనిని నిత్యం 30 వేల మంది పర్యాటకులు సందర్శిస్తారట. ప్రపంచంలోనే ఫేమస్ పోట్రెయిట్ మోనాలిసా ఉన్నంది ఇక్కడే.
విలువైన ఆభరణాలు, చారిత్రకమైన వస్తువులను దోచుకునేందుకు లౌవ్రే మ్యూజియంలో తరచూ దోపిడీ దొంగలు దాడులకు పాల్పడుతుంటారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ చేతి నుంచి జాలువారిన మోనాలిసా పోట్రెయిట్ 1911 లో అపహరణకు గురైంది. రెండేళ్ల తర్వాత ఇటలీలో దొరికింది.
1983లోనూ ఈ మ్యూజియంలో దొంగలు పడి పలు వస్తువులను దోచుకున్నారు. ఆ వస్తువులను 2021లో తిరిగి రికవరీ చేశారు.