ePaper
More
    Homeక్రీడలుNeeraj Chopra | పారిస్ డైమండ్ లీగ్ విజేత‌గా బ‌డిసె వీరుడు.. 8 ఏళ్ల తర్వాత...

    Neeraj Chopra | పారిస్ డైమండ్ లీగ్ విజేత‌గా బ‌డిసె వీరుడు.. 8 ఏళ్ల తర్వాత ఈ లీగ్‌లో పోటీకి దిగాడు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Neeraj Chopra | భారత స్టార్ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) పారిస్ డైమండ్ లీగ్‌ ప్రతిష్టాత్మక పోటీలో బరిలోకి దిగి విజేత‌గా నిలిచారు. ఇప్పటికే ఈ సంవత్సరం 90 మీటర్ల దూరం అందుకున్న ఈ మాజీ ఒలింపిక్‌, ప్రపంచ చాంపియన్ పారిస్‌ డైమండ్‌ లీగ్‌(World Champion Paris Diamond League)పై దృష్టి సారించి విజేత‌గా నిలిచాడు దోహా డైమండ్ లీగ్‌లో నిరాశపరిచిన బడిసె వీరుడు పారిస్ డైమండ్ లీగ్‌లో మాత్రం అదరగొట్టాడు. జూలియన్ వెబర్‌(జర్మనీ)ను రెండోస్థానానికి పరిమితం చేస్తూ టైటిల్ గెలుపొందాడు. ఈ రెండేళ్లలో అతడు డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలవడం ఇదే మొదటిసారి. 2017లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా ఈ పోటీల్లో పాల్గొన్న చోప్రా.. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

    Neeraj Chopra | గెలిచి చూపించాడు..

    ఇప్పుడు మాత్రం ఏకంగా టైటిల్ విజేతగా అవతరించి రికార్డులు బద్ధలు కొట్టాడు. దోహా(Doha)లో జరిగిన డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల మార్క్ అందుకున్న చోప్రా.. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో సత్తా చాటాడు. తొలి రౌండ్‌లో ఈటెను 88.16 మీటర్ల దూరం విసిరాడు. రెండో రౌండ్‌లో 85.10 మీటర్లకే పరిమితమైన నీరజ్ తర్వాత మూడు ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. అయినా సరే ఒత్తిడికి లోనవ్వకుండా ఆఖరిదైన ఆరో రౌండ్‌లో భారత స్టార్ బడిసెను 82.89 మీటర్ల దూరం విసిరి విజేతగా అవతరించాడు. డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల దూరంతో చోప్రాకు షాకిచ్చిన వెబర్ ఈసారి మాత్రం తేలిపోయాడు.

    తొలి రౌండ్‌లో 87.88 మీటర్ల మార్క్ అందుకున్న అతడు తదుపరి ప్రయత్నాల్లో మాత్రం రాణించ‌లేక‌పోయాడు. వెబర్ రెండో స్థానానికి పరిమితం కాగా.. లూయిజ్ మౌరిసియో డిసిల్వా(Luiz Mauricio de Silva)(బ్రెజిల్) మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న చోప్రా జూన్ 24న ఒస్ట్రావా(చెక్ రిపబ్లిక్)లో జరుగనున్న గోల్డెన్ స్పైక్స్ అథ్లెటిక్స్‌(Golden Spikes Athletics)లో పోటీ పడనున్నాడు. అనంతరం జూలై 5న తన పేరుతో తొలిసారి నిర్వహిస్తున్న నీరజ్ చోప్రా క్లాసిక్ ఎడిషన్‌లో (Classic Edition) బల్లెం యోధుడు పాల్గొంటాడు. మొత్తానికి ఈ పోటీ మాత్రం చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. మొత్తం ఆరు రౌండ్లలో మూడు రౌండ్లు సరిగ్గా విసిరిన నీరజ్- ఏ రౌండ్​లోనూ 90 మీటర్లు జావెలిన్​ విసరలేదు. అయినా అతనే విజేతగా నిలిచాడు.

    More like this

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...

    Hydraa | రూ.500 కోట్ల విలువైన భూమి కబ్జా.. షాకిచ్చిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా...

    Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు....