3
అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పేరెంట్, టీచర్ మీటింగ్ (parent-teacher meeting) ఉంటుందని ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ మధుకుమార్ తెలిపారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు (parents) తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని కోరారు. తద్వారా విద్యార్థుల విద్యాప్రగతి, వారికి అందిస్తున్న వసతులు, హాజరు, తదితర విషయాలపై అధ్యాపకులతో చర్చించవచ్చని సూచించారు. అలాగే వారి సూచనలు, సలహాలు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజ్‌కుమార్, శ్రీహరి, గంగాధర్, మురళీకృష్ణ, గంగారాం, మహేందర్, స్రవంతి పాల్గొన్నారు.