అక్షరటుడే, ఇందూరు: Para Olympics | దుబాయ్ Dubai లో నిర్వహించిన ఏషియన్ యూత్ పారా ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో జిల్లాకు చెందిన శీనికేష్ కిరణ్ అద్భుత ప్రతిభ చూపాడు. దుబాయ్‌లోని ఏవైపీజీ స్విమ్మిగ్‌పూల్‌లో జరిగిన పోటీల్లో క్రీడాకారుడు శ్రీనికేష్ పాల్గొన్నాడు.
Para Olympics | మూడు విభాగాల్లో విజయం..
స్విమ్మింగ్ పోటీల్లో భాగంగా 100 మీటర్ల ఫ్రీస్టైల్, 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో అలాగే 50 మీటర్ల ప్రీస్టైల్ విభాగాల్లో మూడు కాంస్య పతకాలను సాధించి ఔరా అనిపించాడు. ఓ పారా స్విమ్మింగ్ క్రీడాకారులు ఇంటర్నేషనల్ ఈవెంట్లో మూడు పతకాలను సాధించడం అద్వితీయమని క్రీడాభిమానులు అభినందించారు.
Para Olympics | పీశాట్ అభినందనలు..
ఈ సందర్భంగా పారా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్విమ్మింగ్ క్రీడాకారుడిని అభినందించింది. పీశాట్ అసోసియేషన్ ఛైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్ అలివేలు మంగమ్మ, సెక్రటరీ జనరల్ సమంతా రెడ్డి, స్విమ్మింగ్ కోచ్ దినేష్ రాజోరియా తదితరులు శ్రీనికేష్ను ప్రత్యేకంగా అభినందించారు. అతడు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.