ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Papikondalu Tour | పాపికొండల విహారయాత్ర నిలిపివేత

    Papikondalu Tour | పాపికొండల విహారయాత్ర నిలిపివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Papikondalu Tour | ప్రకృతి అందాలకు నెలవు పాపికొండలు (Papikondalu). కొండల మధ్యలో గోదావరిపై పడవలో ప్రయాణిస్తూ (boat traveling) ఆ ప్రకృతి అందాలను చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. ఎత్తయిన కొండలు.. పచ్చని చెట్లు.. కనుచూపు మేర నీరు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ అందాలను చూడడానికి ఏపీ పర్యాటక ప్రత్యేక బోట్లను (special tourist boats) నడుపుతోంది. దీంతో ఏపీకి వచ్చే పర్యాటకుల్లో చాలా మంది పాపికొండలను తప్పక సందర్శిస్తారు. అయితే ప్రస్తుతం వర్షాలు పడుతుండడం.. గోదావరికి వరద పెరగడంతో పాపికొండల యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

    ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetharamaraju district) దేవికొండ నుంచి పాపికొండలను చూడడానికి బోట్లు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రను జలవనరుల శాఖ (Water Resources Department) తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షంతో పాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు డి.రావిలంక–దండంగి గ్రామాల మధ్య ఆర్అండ్‌బీ రహదారిపై గోదావరి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గండి పోచమ్మ ఆలయం వైపు రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

    Papikondalu Tour | ప్రకృతి అందాల నెలవు

    పాపికొండలు ప్రకృతి అందాలకు నెలవు. పచ్చని ఈ కొండల (green hills) మధ్య గోదావరిపై ప్రయాణం ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుంది. దేవీపట్నంతో పాటు రాజమహేంద్రవరం (Rajahmundry), తెలంగాణలోని భద్రాచలం (Bhadrachalam) నుంచి కూడా పాపికొండలకు పడవల్లో వెళ్లొచ్చు. అయితే ప్రతి ఏడాది వానాకాలంలో ఈ యాత్రను అధికారులు నిలిపి వేస్తారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వరద పెరగ్గానే యాత్రను ఆపేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా దేవీపట్నం నుంచి పాపికొండలు యాత్రను ఆపేశారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో చెబుతామన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...