అక్షరటుడే, వెబ్‌డెస్క్: Papaya seeds | సాధారణంగా మనం బొప్పాయి పండును తిని, దానిలో ఉండే నల్లటి గింజలను పనికిరానివిగా భావించి పారేస్తుంటాం. కానీ, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బొప్పాయి పండు కంటే ఆ గింజలే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన చర్మ సంరక్షణ సాధనాల్లో బొప్పాయి గింజలు ఒకటి. వీటిల్లో దాగి ఉన్న పోషకాలు ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా.. మొటిమలు, మచ్చల వంటి సమస్యలను సమూలంగా నివారిస్తాయి.
పోషకాల గని: బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ తో పాటు ఫోలేట్ Folate, మెగ్నీషియం magnesium, పొటాషియం potassium వంటి ఖనిజాలు minerals పుష్కలంగా ఉంటాయి. అయితే గింజలలో ఉండే ‘పపైన్’ (Papain) అనే ప్రత్యేక ఎంజైమ్ చర్మానికి ఒక వరప్రసాదం. ఇది సహజసిద్ధమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి, చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం లోపలి నుంచి శుభ్రపడి, సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.
Papaya seeds | మొటిమల నివారణ:
చాలామంది జిడ్డు చర్మం వల్ల వచ్చే మొటిమలతో బాధపడుతుంటారు. చర్మ రంధ్రాలలో ధూళి, చెమట పేరుకుపోయినప్పుడు ఇన్ఫెక్షన్లు ఏర్పడి మొటిమలకు దారితీస్తాయి. బొప్పాయి గింజల్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
వాడే విధానం: కొన్ని బొప్పాయి గింజలను తీసుకుని మెత్తటి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాసి, సుమారు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే, క్రమంగా మొటిమలు తగ్గి చర్మం శుభ్రపడుతుంది.
Papaya seeds | ఫేస్ మాస్క్:
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం సాగడం, ముడతలు రావడం సహజం. బొప్పాయి గింజల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. తేనె చర్మానికి అవసరమైన తేమను అందిస్తే.. బొప్పాయి గింజలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు మసాజ్ చేయడం వల్ల ముడతలు తగ్గి, చర్మం ఎప్పుడూ యవ్వనంగా, మృదువుగా కనిపిస్తుంది.