అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రెండో విడత ‘పనుల జాతర’ (Panula Jathara) కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీడీవో ప్రకాష్ (MPDO Prakash) పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలో శుక్రవారం వివిధ గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పనుల జాతరలో భాగంగా భిక్కనూరు (Bhiknoor), మీసాన్ పల్లి, అడవిలింగాల పంచాయతీల్లో గేదెల షెడ్లకు భూమిపూజ నిర్వహించారు. గతేడాది చేపట్టిన పనుల జాతరలో ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు కల్పించామని, అభివృద్ధి పనులలో కూలీల వేతనాలకు అందజేశామని ఆయన వివరించారు.
ఈ దఫా పనుల జాతరలో ఇందిరా మహిళాశక్తి పథకం (Indira Mahila Sakthi Scheme) ద్వారా మహిళలకు ఉపాధి కల్పన, జలనిధి కింద నీటి సంరక్షణ పనులతో పాటు, వ్యవసాయ పొలాలకు బాటల నిర్మాణం, ఫల వనాల పెంపకం చేపడతామన్నారు. పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసే ఆ చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ప్రత్యేక అధికారి సురేందర్, ఏపీవో వినోద్‌తో పాటు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.