ePaper
More
    Homeక్రీడలుRishabh Pant | కెరీర్​ బెస్ట్​ ర్యాంక్​ సాధించిన రిషభ్​ పంత్​

    Rishabh Pant | కెరీర్​ బెస్ట్​ ర్యాంక్​ సాధించిన రిషభ్​ పంత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rishabh Pant | టీమిండియా బ్యాట్స్​మన్​, వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ ఐసీసీ ర్యాంకింగ్స్​(ICC Rankings)లో అదరగొట్టాడు. ఇంగ్లాండ్​తో జరిగిన మొదటి టెస్ట్​లో రెండు ఇన్నింగ్స్​లలో సెంచరీలతో చెలరేగిన భారత వికెట్​ కీపర్​ బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్​లో ఒక స్థానం మెరుగుపరుచుకొని ఏడో స్థానానికి చేరుకున్నాడు.

    ఐపీఎల్​లో లక్నో సూపర్​ జెయింట్స్​ కెప్టెన్​(Lucknow Super Giants captain)గా ఉన్న రిషబ్​ పంత్​ ఘోరంగా విఫలం అయ్యాడు. కేవలం ఒక్క మ్యాచ్​లో మాత్రమే సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లాండ్​ టూర్​లో ఈ వికెట్​ కీపర్​ ఎలా ఆడుతాడోనని భారత అభిమానులు ఆందోళన చెందారు. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ పంత్(Rishabh Pant )​ లీడ్స్​ వేదికగా జరిగిన తొలి టెస్ట్​లో రెండు సెంచరీలు చేశాడు. మొదటి ఇన్నింగ్స్​లో 178 బంతుల్లో 134 పరుగులు చేసిన పంత్​.. రెండో ఇన్నింగ్స్​లో 140 బంతుల్లో 118 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్​లో భారత్​ ఓడినా.. పంత్​ తన బ్యాట్​తో ఆకట్టుకున్నాడు.

    Rishabh Pant | 800 పాయింట్లతో రికార్డు

    ఇంగ్లాండ్​ తొలి టెస్ట్​లో రాణించడంతో పంత్​ తన కెరీర్​లో తొలిసారి ఏడో స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్​ ర్యాంకింగ్స్​లో 800 రేటింగ్ పాయింట్లు(800 rating points) సాధించాడు. అంతేగాకుండా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్​ కీపర్​గా నిలిచాడు. అయితే ఇంగ్లాండ్​ క్రికెటర్​ జో రూట్​ 889 పాయింట్లతో టెస్ట్​ ర్యాంకింగ్స్​లో తొలి స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్​ వైస్​ కెప్టెన్​ హ్యరీ బ్రూక్​ 874 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్​ బ్యాటర్​ కేన్​ విలియమ్సన్​ 867 పాయింట్లతో మూడో ర్యాంక్​లో కొనసాగుతున్నాడు.

    భారత యువ క్రికెటర్​ 851 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. జైశ్వాల్​ ఇంగ్లాండ్​తో జరిగిన తొలిటెస్ట్​లో మొదటి ఇన్నింగ్స్​లో సెంచరీతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్​లో నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. టీమిండియా టెస్ట్​ కెప్టెన్​ శుబ్​మన్​ గిల్​ ఐదు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్​తో రెండో ఇన్నింగ్స్​లో 137 పరుగులతో రాణించిన కేఎల్​ రాహుల్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్​ సాధించాడు. బౌలింగ్​లో ఇండియన్​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...