HomeజాతీయంPankaj Dheer | మహాభారత్​లోని కర్జుడి పాత్రధారి పంకజ్ ధీర్ ఇక లేరు..

Pankaj Dheer | మహాభారత్​లోని కర్జుడి పాత్రధారి పంకజ్ ధీర్ ఇక లేరు..

Pankaj Dheer | బీఆర్ చోప్రా టెలివిజన్​ సీరియల్​ 'మహాభారత్' అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో కర్ణుడి పాత్ర పోషించిన నటుడు పంకజ్ ధీర్(68) తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pankaj Dheer | చిన్నప్పుడు ప్రసారమైన బీఆర్ చోప్రా టెలివిజన్​ సీరియల్​ ‘మహాభారత్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో కర్ణుడి (Karna) పాత్ర పోషించిన నటుడు పంకజ్ ధీర్(68) (Pankaj Dheer) తుదిశ్వాస విడిచారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న పంకజ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (అక్టోబరు 15) కన్నుమూశారు. ముంబయిలోని పవన్ హన్స్ క్రిమిటోరియంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Pankaj Dheer | కర్ణుడి పాత్రతో పాపులారిటీ..

పంకజ్ ధీర్ పంజాబ్‌కు చెందినవారు. 1980లో సినీ కెరీర్​ను ప్రారంభించారు. బీఆర్ చోప్రా టీవీ సీరియల్‌ ‘మహాభారత్‌’ (Mahabharat) లో కర్ణుడి పాత్ర పోషించి పాపులారిటీ సాధించారు.

జీ హారర్ షో, చంద్రకాంత, కానూన్, ససురాల్ సిమర్ కా వంటి టెలివిజన్​ సీరియల్స్‌లోనూ.. అందాజ్, సోల్జర్, బాద్సా, తుమ్కో న భూల్ పాయేంగే వంటి సినిమాల్లోనూ ప్రముఖ పాత్రలు పోషించారు.

పంకజ్ ధీర్ తనయుడు నికితిన్ ధీర్ సైతం నటుడే. జోథా అక్బర్, చెన్నై ఎక్స్‌ప్రెస్, సూర్యవంశి తదితర మూవీల్లో నటించారు. పంకజ్‌ తండ్రి సీఎల్ ధీర్ ఫిల్మ్‌మేకర్‌గా పేరు సంపాదించారు. జిందగీ, బహు బేటి వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.
పంకజ్ ముంబయిలో తన బ్రదర్​ సట్లజ్ ధీర్‌తో కలిసి షూటింగ్ స్టూడియో స్థాపించారు. ఔత్సాహిక నటుల కోసం 2010లో అభినయ్ యాక్టింగ్ అకాడమీని నెలకొల్పారు. పంకజ్ ధీర్​ మరణం పట్ల టీవీ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.