అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి జిల్లాలో నాటుబాంబుల పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటన మండలంలోని గర్గుల్ (Gargul Village)లో చోటు చేసుకుంది. కాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
Kamareddy | వీధికుక్క మృతి..
గర్గుల్ గ్రామానికి చెందిన మొగుళ్ల సాయాగౌడ్కు చెందిన పంట చేనులో శనివారం ఉదయం సాయాగౌడ్ తమ్ముడు రామాగౌడ్ నీళ్లు పారించడానికి వెళ్లాడు. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో వెళ్లి చూడగా ఓ కుక్క (Dog) తలపగిలి మృతిచెందింది. చుట్టుపక్కల చూడగా పొగ రావడాన్ని గమనించి నాటు బాంబులు పేలినట్టుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ పంటచేనులో బాంబులు పడేసి ఉండడంతో అది తెలియని కుక్క నోట పట్టుకోగా తలపగిలి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
Kamareddy | తమకు హాని చేసేందుకే..
తమకు హాని చేయడానికే బాంబులు పడేసి ఉంటారని సదరు రైతు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చేనులో బాంబులు పడేసి తమకు హాని కలిగించాలని ప్రయత్నించిన దుండగలపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయాగౌడ్తో పాటు చుట్టుపక్కల రైతులు కోరుతున్నారు. పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అడవి పందుల కోసం ఎవరైనా పెట్టి ఉంటారా.. ? లేదా కావాలని పెట్టారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఈ విషయమై దేవుని పల్లి ఎస్సై రంజిత్ (SI Ranjith)కు వివరణ కోరగా.. బాంబులు పేలిన ఘటన నిజమేనని దీనిపై బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు.