ePaper
More
    Homeజిల్లాలుకరీంనగర్Bribe | లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా దొరికిన పంచాయతీ సెక్రెటరీ

    Bribe | లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా దొరికిన పంచాయతీ సెక్రెటరీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bribe | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పనికోసం కార్యాలయానికి వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల (state-level officials) వరకు లంచాలకు మరిగారు. కొందరు అధికారులు డబ్బులు తీసుకోనిదే ఏ పని చేయడం లేదు. తాజాగా ఓ పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు.

    వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా (Karimnagar district) వీణవంక మండలం చల్లూర్​ గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB officials) రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. కొత్తగా నిర్మించిన ఓ ఇంటికి నంబర్​ కేటాయించేందుకు సెక్రెటరీ రూ.20 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. బాధితుడి శుక్రవారం నుంచి శుక్రవారం లంచం డబ్బులు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసి కరీంనగర్​ ఏసీబీ కోర్టులో (Karimnagar ACB court) హాజరు పర్చారు.

    Bribe | లంచం అడిగితే ఫోన్​ చేయండి

    ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

    Latest articles

    Vikram Singh Mann | తెలంగాణ విజిలెన్స్‌ కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Vikram Singh Mann : తెలంగాణ విజిలెన్స్‌ (Telangana Vigilance) కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌...

    ACB | ఏసీబీ దూకుడు.. హాస్టల్​, గురుకుల పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచాలు తీసుకుంటున్న అధికారులు వల పన్ని...

    Asaduddin Owaisi | రాజకీయాల్లో హద్దులు దాటొద్దు.. మోదీ మాతృమూర్తిని కించపరచడాన్ని ఖండించిన ఒవైసీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Asaduddin Owaisi | రాజకీయాల్లో పరస్పర భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ, భాష విషయంలో హద్దులు...

    Urea | యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే సస్పెండ్​ చేస్తా.. మంత్రి పొంగులేటి వార్నింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Urea | రాష్ట్రంలో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ...

    More like this