ePaper
More
    HomeతెలంగాణACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB | రాష్ట్రంలో ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. నిత్యం ఒకరిద్దరు అవినీతి అధికారులు (Anti-Corruption Department officials) అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్నారు. అయినా అవినీతి అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. లంచాలకు మరిగిన అధికారులు ప్రజల వద్ద ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.

    తాజాగా.. పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) మునిపల్లి మండలం బుధేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి ఏసీబీ అధికారులకు (ACB officials) రెడ్​ హ్యాండెడ్​గా దొరికింది. గ్రామంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ఓ వ్యక్తి వద్ద రూ.8 వేలు డిమాండ్​ చేసింది. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని అనిశా అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు.

    ACB | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి

    అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా 9440446106 నంబర్​కు వాట్సప్​ ద్వారా సంప్రదించవచ్చన్నారు. లేదంటే ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) ద్వారా అవినీతి అధికారుల సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు. https://acb.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...