అక్షరటుడే, కామారెడ్డి : Panchayat Secretaries | జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ కార్యాలయంలో (TNGOs Office) శనివారం ఎన్నుకున్నారు. ఎన్నికల్లో భాగంగా అన్ని పదవులకు ఒకటి చొప్పున నామినేషన్ వచ్చినందున.. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి టీఎన్జీవోస్ కామారెడ్డి అర్బన్ ఉపాధ్యక్షుడు భక్తవత్సలం ప్రకటించారు.
Panchayat Secretaries | ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మహేష్ గౌడ్..
ఫోరం కార్యవర్గం (Forum Executive Committee) నూతన జిల్లా అధ్యక్షుడిగా మహేష్ గౌడ్, సహాధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, జిల్లా కోశాధికారిగా అల్లాడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పబ్లిసిటీ సెక్రెటరీ, ఆఫీస్ సెక్రెటరీ, జిల్లా ఈసీ మెంబర్ల కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా సహాధ్యక్షుడు చక్రధర్, జిల్లా కోశాధికారి దేవరాజు, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం (TNGOs Central Association) ఈసీ మెంబర్ శివకుమార్, సంయుక్త కార్యదర్శి రమణ కుమార్, జిల్లా ఈసీ మెంబర్ దత్తాద్రి, అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సృజన్, జిల్లా పంచాయితీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.